ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువ లేనిది-మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ లక్డీకాపూల్‌లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చాలా సందర్భాల్లో న్యాయవాదులు పోరాటాలను కొనసాగించారన్నారు. న్యాయవాదుల పోరాట స్పూర్తిని ఏనాడూ మరువబోమని తెలిపారు. ఉద్యమకారులకు న్యాయవాదులు ఎంతో అండగా నిలిచారని తెలిపారు. 

గతంలో లాయర్లతో సోదరభావంతో ఉన్నం. భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి పెద్ద పీట వేస్తామని పునరుద్ఘాటించారు. లాయర్లకు ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైకోర్టు విభజనపై ఆయన స్పందిస్తూ రాష్ర్టాన్నే సాధించుకున్నం.. హైకోర్టును సాధించుకోలేమా.. అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కలలు గన్న బంగారు తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. 60ఏళ్లలో చేయని ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలల్లో చేసిన్రని అన్నారు.
This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.