ఉచిత విద్య అమలుపై ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా పాటిస్తం: సీఎం

కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుపై ప్రతిపక్షాల సూచనలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఓవర్ నైట్‌లో అయ్యేది కాదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో విద్య ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొందరైతే పని గట్టుకుని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారని తెలిపారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా ఉండాలో అందరం కూర్చుని ఫర్‌ఫెక్ట్‌గా చర్చించి విద్యా విధానాన్ని రూపొందిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విద్యావేత్తలు, ఇతర పార్టీల నేతలతో త్వరలోనే సమావేశం అవుతామని సీఎం తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.