‘హోంమంత్రిలేడు, డీజీపీ పత్తాలేడు’

హైదరాబాద్: రాష్ట్రానికి హోంమంత్రే లేడని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. ‘హోంమంత్రిలేడు. డీజీపీ పత్తాలేడు’ అని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. సీమాంధ్రలో కృతిమ ఉద్యమం రెచ్చిపోతున్నా సర్కారు పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. సీమాంధ్రలో జాతీయనేతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. సర్కారు ఆస్తులను తగలబెడుతున్నా ఖాకీలు నోరు మెదపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ఫ్యాక్షనిస్టులు, సంఘ విద్రోహులు చెలరేగిపోతున్నా గుడ్లప్పగించి చూస్తుందని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.