హోంమంత్రిని అరెస్ట్ చేయాలి: గుండా మల్లేశ్

అవినీతిలో కూరుకుపోయిన కొంతమంది మంత్రులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఆరోపించారు. సీబీఐ చార్జీషీట్‌లో హోంమంత్రి సబితాడ్డిని నిందితురాలిగా ఉన్నందున ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, జైల్లో ఉండాల్సిన వాళ్లంతా సీఎం అండతో బయట తిరుగుతున్నారన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సమాధి కడతారని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.