హైదరాబాద్ రణరంగమే : ఎంపీ గుత్తా

ఏపీ ఎన్జీవోల సభకు అనుమతి రద్దు చేయకపోతే హైదరాబాద్ రణరంగమే అవుతుందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్జీవోల సభకు అనుమతివ్వడం సీఎం కుట్రలో భాగమేనని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ, తెలంగాణవాదుల సభకు అనుమతివ్వని సీఎం ఎన్జీవోల సభకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తెలంగాణవాదుల శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.