హైదరాబాద్ మాదే.. హైదరాబాద్ హౌస్ మాదే -ఒవైసీ

హైదరాబాద్ : హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేసిన్రు. హైదరాబాద్ హౌస్ తెలంగాణకే అప్పగించాలని డిమాండ్ చేసిన్రు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. హైదరాబాద్‌పై ఇంకా స్పష్టత రాలేదన్నరు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానికి కూడా ఒప్పుకోమన్నరు.  షరతులు లేని తెలంగాణ ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ కేంద్రం పరిధిలో ఉండకూడదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ తెలంగాణ చేతిలోనే ఉండాలి. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు, సీమాంధ్రకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన్రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.