హైదరాబాద్ పై కొర్రీలు పెట్టాలని చూస్తే ప్రజలు బెబ్బులిలా పంజా విసురుతరు-కేసీఆర్

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపాలనుకుంటే, హైదరాబాద్ పై కొర్రీలు పెట్టాలని ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు బెబ్బులిలా పంజా విసురుతారని కేసీఆర్ అన్నరు.  28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తెలంగాణకు ఎందుకు పెడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించిన్రు. లా అండ్ ఆర్డర్ కాపాడుకోవడం మాకు తెలియదా అని అడిగారు. తెలంగాణపై కేంద్రం కొర్రీలు పెడితే మరో యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించిన్రు. శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండేందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించరని స్ఫష్టం చేశారు. తెలంగాణ ప్రజలు సౌమ్యులు… రాష్ట్రం ఏర్పడుతుందనే సంయమనంతో ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి దోపిడీ కోసమే సమైక్యాంధ్ర అంటున్నారని ఆరోపించారు. ఒక్కపైసాకుడా ఇవ్వను రాసుకో అన్న సీఎంకు సమైక్యాంధ్ర అనే అర్హత లేదని చెప్పారు. మణుగూరు విద్యుత్ ప్లాంట్‌ను కుట్ర ప్రకారమే విజయవాడకు తరలించుకుపోయారని తెలిపారు. సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ఉద్యమం ఆగదని కేసీఆర్ పేర్కొన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.