హైదరాబాద్ జోలికొస్తే యుద్ధమే

– ప్రజలు సింహాలై గర్జిస్తారు.. విలీనానికి ముందే అభివృద్ధి
– అధికారికంగా విలీనం ఎందుకు నిర్వహించరు?
– ప్రశ్నించకుండా సలాం కొడుతున్న టీ మంత్రులు
– తెలంగాణపై ముందడుగు లేకే మళ్లీ ఆత్మహత్యలు
– నాగర్‌కర్నూల్‌లో విలీన దినోత్సవంలో ఎమ్మెల్యే నాగం
‘తెలంగాణలో హైదరాబాద్ ముమ్మాటికీ అంతర్భాగమే. సమైక్యవాదులు మాదంటూ ముందుకొస్తే తెలంగాణ ప్రజలంతా సింహాలై గర్జించి యుద్ధం ప్రకటిస్తారు’ అని ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌డ్డి హెచ్చరించారు. మంగళవారం రాజకీయాలకు అతీతంగా నాగర్‌కర్నూల్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రాలో విలీనానికి ముందే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు, నీటి పారుదల రంగం, రోడ్లు, సొంత రైల్వేవ్యవస్థ ఉందని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంపదంతా దోపిడీకి గురవుతోందని ఆరోపించారు.

nagamjanaradhanనీళ్లు, నిధు లు, నౌకర్లను సీమాంవూధులు దోచుకోవడంతో తెలంగాణవాసులు దుర్భ ర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రం లో ఉర్దూను కనుమరుగు చేశారని మండిపడ్డారు. ఆంధ్రాలో విలీనం కాకుంటే ప్రస్తుతం తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి వసతి సమకూరేదన్నారు. ఏపీఎన్జీవోలు తప్పుడు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఇకపై తెలంగాణలో సమైక్య సభలు నిర్వహించొద్దని..శాంతియుతంగా ఉన్న ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. సీఎం సమైక్యవాదిగా మారారని మండిపడ్డారు.

బిల్లు ఆమోదింపజేసే బాధ్యత టీ మంత్రులదే
తెలంగాణ విలీన దినోత్సవాన్ని కర్నాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహిస్తుంటే, తెలంగాణలో సీమాంధ్ర పాలకులు వివక్ష ప్రదర్శించారని నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ మంత్రులు ప్రశ్నించకుండా, ఆంధ్రోళ్లకు దాసోహమయ్యారని విమర్శించారు. సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీర్మానం తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మళ్లీ బలిదానాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి అమలు చేయించే బాధ్యత టీ మంత్రులదేనన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రజలు భరతం పడతారని హెచ్చరించా

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.