హైదరాబాద్ ఉద్యోగాల విషయాల్లో కేంద్రం మెలిక

రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 85 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371(డీ) అడ్డం కాదని హోంశాఖ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 371(డీ) ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోనల్ సిస్టమ్ కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఉద్యోగాల విషయంలో అవసరమైతే  సవరణ చేసే విషయాన్ని పరిశీలించాలని హోంశాఖ సూచించింది . ఈ సవరణ  వల్ల రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం తెలంగాణలో ఉద్యోగుల కొరత ఉంటే ఆంధ్రా ఉద్యోగులను ఇక్కడే ఉంచే అవకాశం ఉంది. ఇక్కడ మళ్లీ తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం మెండుగా ఉన్నది. ఎవరి ఆధిపత్యాన్ని సహించకలేక తెలంగాణ తెచ్చుకుంటున్నమో.. తిరిగి వాళ్ల ఆధిపత్యాన్ని భరించాల్సిన అవసరం ఏర్పడే ప్రమాదముంది. అందుకే హైదరాబాద్ ఉద్యోగాల విషయంలో సవరణలు.. సవరాలు అంటూ పేచిపెడితే ఊరకునేదిలేదు.

అటు నివేదికను హోంశాఖ మూడు విభాగాలుగా విభజించింది. 1. కేబినెట్, 2. ఆంధ్రప్రదేశ్ సంక్షిప్త సమాచారం, 3. విభజనకు సంబంధించిన కీలకాంశాలు పొందుపరించింది.. సాగునీరు, విద్యుత్, విద్య, హైదరాబాద్‌తో పాటు విభజనకు సంబంధించిన అన్ని అంశాలను నివేదికలో  ఉంచామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. హైదరాబాద్‌ను తెలంగాణ జిల్లాగానే హోంశాఖ పరిగణించింది. శాసన మండలి కొనసాగింపుపై నిర్ణయాధికారం తెలంగాణదే అని తెలిపింది. . శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని యథాతథంగా జీవోఎంకు హోంశాఖ సమర్పించింది. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ కోసం వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతం ముంపునకు గురై ప్రయోజనమంతా ఆంధ్రకు కలుగుతుందనే కారణంతో తెలంగాణవాదులు పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నారని హోంశాఖ నివేదికలో పేర్కొంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.