హైదరాబాద్ అల్లకల్లోలానికి సీమాంధ్ర మీడియా కుట్ర!!

సమైక్యాంధ్ర ఆందోళనలను తలకెత్తుకున్న సీమాంధ్ర మీడియా అధిపతులు ..నిధులను కూడా సమకూర్చినట్టు సమాచారం. ఆగస్టు 25 వరకు సీమాంధ్రలో ఆందోళనలు జరపడానికి, యూత్ ను ఆకట్టుకోవడానికి సరిపడ నిధులున్నయని ఐబీ రిపోర్ట్.. హైదరాబాద్ లోని సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యోగులపై కవ్వింపు చర్యలకు దిగేలా అన్ని సీమాంధ్ర మీడియా సంస్థలు సహకారమందిస్తున్నయి.  సీమాంధ్ర మీడియా ప్రతినిధులు వ్యూహరచన చేస్తున్నరు. ఏపీజేఎఫ్ అని ఓ సంఘాన్నికూడా ఏర్పాటు చేసుకున్నరు. ఈ మీడియా సంస్థలు హైదరాబాద్ లో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెచేసేలా ఒత్తిడి చేస్తున్నయి.. సమ్మె కోసం డేట్ ఫిక్స్ చేసింది సీమాంధ్ర  మీడియానే.. సీమాంధ్రలో ఆందోళనలకు ఈ మీడియా సంస్థలే కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలో పేర్కొన్నయి. తెలంగాణ ప్రకటన వచ్చినప్పటి నుంచి సీమాంధ్ర చానల్ ఓనర్లు, ప్రతినిధులు రహస్య భేటీలు జరుపుతూ సమైక్య ఆందోళనలకు దిశానిర్దేశం చేస్తున్నయి.. సచివాలయంలోని పలువురు ఉద్యోగసంఘాల నేతలను టార్గెట్ చేసినట్టు సమాచారం.. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు దాడులు చేసుకునేలా  కుట్రపన్నారని  రిపోర్ట్..  అంతేకాకుండా పలువురు తెలంగాణవాదులపైనా దాడి చేసేందుకు వ్యూహాలు రచించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

అటు సచివాలయంలో.. ఇటు బయట తెలంగాణ ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రజలపైకి ఆంధ్రా ఉద్యోగులు, ప్రజలను దాడికి పురిగొల్పితే హైదరాబాద్ అల్లకల్లోలం అయితదని.. సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటుతయని వీళ్లు భావిస్తున్నట్టు సమాచారం..

 

 

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.