హైదరాబాద్‌లో హాంశాఖ సమావేశం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర హోంశాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ డీజీపీలతో విజయ్‌కుమార్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏకైక మాజీ డీజీపీ పేర్వారం రాములుకు ఆహ్వానం అందలేదు. పేర్వారం రాములుకు ఆహ్వానం అందకపోవడంపై టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. మాజీ డీజీపీ పేర్వారం రాములును పిలవాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.