హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే ఊరుకోం: కోదండరాం

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టినా ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సీడబ్ల్యూసీ, కేంద్రకేబినెట్ తీర్మానం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మగౌరవంతో కూడిన పూర్తి స్వయంపాలనే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి తెలంగాణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చేయాలని అన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.