హెచ్‌ఎండీఏ పరిధిని ఒప్పుకోం

నవంబర్ 14: రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి సంబురాల్లో మునిగి తేలుతున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఆంటోనీ కమిటీ సిఫారసులంటూ ప్రచారంలోకి వచ్చిన అంశాలతో కంగుతిన్నారు. హైదరాబాద్ అధికారాలు, హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయడం, భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను సీమాంవూధలో కలుపాలని సూచిస్తూ ఆంటోనీ కమిటీ జీవోఎంకు నివేదిక సమర్పించినట్లు వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ నేతలు, ఇతర సీనియర్లు అంతా కలిసి జీవోఎంతోపాటు పార్టీ పెద్దలను కలిసి ఆ అంశాలపై తమ వ్యతిరేకతను తెలియజేయాలని నిర్ణయించారు. జూలై 30న సీడబ్ల్యూసీ, ఆ తరువాత కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదని వీరు కోరనున్నారు.

తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాని ఆంశాలను తొలగించాలని కోరనున్నారు. మూడు రోజుల క్రితం నగరంలో మంత్రి జానాడ్డి నివాసంలో సమావేశమైనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యటనకు తొలుత 14వ తేదీ అనుకున్నా అది శుక్రవారం(నేడు) 15 వతేదీకి వాయిదా పడింది. శుక్రవారం హస్తినకు చేరుకునే టీ కాంగ్రెస్ నేతలు ఈనెల 16,17,18 తేదీల్లో ఢిల్లీలోనే మకాం పెట్టి అధిష్ఠానంపై ఒత్తిడి కార్యక్షికమం చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌డ్డి ఈ కార్యక్షికమాలను సమన్వయ పరుస్తారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఎ) పరిధిని ఉమ్మడి రాజధానిగా ప్రకటించి హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ టెరిటరీ (హెచ్‌జెసీటీ) చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జీవోఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధి అంటే మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్, నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుపల్, భువనగిరి, మెద్‌క్ జిల్లా సంగాడ్డి వరకు హెచ్‌జెసీటీ చేసి అధికారాలు కేంద్రం పరిధిలో ఉంచడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మిగిలేది ఏమిటి? అని తెలంగాణ ప్రాంత నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఒప్పుకునేది లేదని వారు స్పష్టం చేస్తూ హైదరాబాద్ జిల్లా రెవిన్యూ పరిధి వరకే ఉమ్మడి రాజధానిగా చేసుకోవాలని వారు టీ నేతలు కోరుతున్నారు.

అలాగే భద్రాచలం డివిజన్‌ను తూర్పుగోదావరి జిల్లాలో కలిపి తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రయత్నాలను కూడా తిప్పి కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. ఆంటోనీ కమిటీ అంశాలని చెప్పే వార్తల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ఢిల్లీ వెళ్ళి హైకమాండ్, జీవోఎంకు తమ వాదనలు వినిపించడం ద్వారా కొంత క్రెడిబిలిటీ వస్తుందని వారు ఆశిస్తున్నారు. సీడబ్ల్యూసీ, యూపీఏలో జరిగిన నిర్ణయం మేరకే 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెస్తామని, జీవోఎంకు ఇదే చెబుతామని పీసీసీ అధికార ప్రతినిధి బీ కమలాకర్‌రావు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.