హెచ్‌ఎంటీవీ రాజశేఖర్‌ను పిలిపించి మాట్లాడిన జర్నలిస్టు పెద్దలు

ఇష్టా రాజ్యంగా ఉద్యోగులను తొలగించి.. ఓ డిపార్ట్‌మెంట్ వారిని మరో డిపార్ట్‌ మెంట్‌కు మార్చుతూ ఉద్యోగులను వేధిస్తున్న రాజశేఖర్‌ను జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు ఐజేయూ శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌ ప్రెస్‌క్లబ్‌కు పిలిపించి మాట్లాడిన్రు. జర్నలిస్టులను వేధించడంపై నిలదీశారు. ఇకమీదట వేధింపులు ఉండవని.. ఉద్యోగులను వారి డిపార్ట్‌ మెంట్స్‌ లోనే కొనసాగిస్తమని రాజశేఖర్‌ చెప్పినట్టు సమాచారం. ఆంధ్రా జర్నలిస్టులకు జీతాలు పెంచి.. తెలంగాణ జర్నలిస్టులకు జీతాలు పెంచకపోవడంపై వివరణ కోరిన్రు.  జర్నలిస్టు సంఘాలు ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవడం శుభపరిణామం..

ఒకరిద్దరిని తొలగించిన వెంటనే జర్నలిస్టు పెద్దలు స్పందించి ఉంటే విషయం ఇంత దూరం వచ్చేది కాదని.. తామంతా  ఆగంకాకపోదుమని హెచ్‌ఎంటీవీ బాధితులు అంటున్నరు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.