హెచ్ఎంటీవీలో షిఫ్ట్ ఇంచార్జుల అరాచకం

కోదండరాం  మాట్లాడుతున్నడా? ఆయన లైవ్ వస్తే తీసుకోవాలా? సీమాంధ్రలో ఆందోళనలు తీసుకుంటున్నం కదా?.. హలో ఏంటి.. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల శాంతి ర్యాలా? అది కూడా లైవ్ తీసుకుంటరా? సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులున్నదే పదుల సంఖ్యలో.. వాళ్ల లైవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి మాటలు హెచ్ఎంటీవీ షిఫ్ట్ ఇంచార్జుల నోటి నుంచి ఇవాళ వినిపించినయి. ప్రతిరోజు ఇలాంటి మాటలు కోకొల్లలు. అదేంటి తెలంగాణవార్తలను కవర్ చేయరా? అని ప్రశ్నిస్తే.. చేయమండి. మూర్తిగారే వద్దని చెప్పారు మీరు మూసుకొని వెళ్లండి అంటున్నరట.  హరీష్ రావు, కేటీఆర్ రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేస్తరు వాళ్ల లైవ్ తీసుకోవద్దని మూర్తిగారు చెప్పిన్రని. అందుకే తెలంగాణ నేతలు, జేఏసీ నేతల లైవ్ లు తీసుకోవడంలేదని చెప్తున్నరట. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఎండీగారితో మాట్లాడుకోండి. మాకు స్పష్టమైన ఆదేశాలున్నయని షిఫ్ట్ ఇంచార్జులు ముక్తకంఠంతో.. సీమాంధ్ర పైత్యంతో చెప్తున్నరట. తెలంగాణవారి మాటకు విలువనే ఇస్తలేరట.

అరెరెరెరె.. ఇంత అరాచకమా? తెలంగాణ ఓనర్ షిప్ ఉన్న చానల్లో.. తెలంగాణవాళ్లను అవమానించడం ఎంత దారుణం. అది కూడా తెలంగాణ ప్రజలు (నేను కూడా) ఎంతగానో ఇష్టపడే  ది గ్రేట్  రామచంద్రమూర్తి గారు  పనిచేస్తున్న చానల్లో జరగడం మరీ దారుణం.

గత కొన్ని రోజులుగా హెచ్ఎంటీవీ సీమాంధ్ర వార్తలను కవర్ చేయడంలో ఎన్టీవీ, టీవీ9 ను మించిపోయింది. సీమాంధ్ర ఆందోళనలను ఆంధ్రా మీడియాతో పాటు మీరు కూడా నడిపిస్తే నడిపించండి కానీ హరీష్ రావు, కేటీఆర్ లైవ్ తీసుకోవొద్దని ఆదేశాలివ్వడమేంటి? పైపెచ్చు తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తరని అపవాదు వేయడం మీకు తగునా..? తెలంగాణవాళ్లను సీమాంధ్రలో కొట్టినప్పుడు ఖండించడం రెచ్చగొట్టే వ్యాఖ్యలా?  సీమాంధ్రలో పుట్టినవారు ఎంత ఆదర్శవాదులైనా సమైక్యవాదులే సుమీ..

(తెలంగాణ ఓనర్ షిప్ లో ఉన్న చానల్ పై ఇలా రాయడం ఇదే ప్రథమం.. ఇదే చివరిది కావాలని కోరుకుంటున్న)

This entry was posted in CRIME NEWS.

2 Responses to హెచ్ఎంటీవీలో షిఫ్ట్ ఇంచార్జుల అరాచకం

  1. Ashok Kumar Munikuntla says:

    I found the Management of HM TV and Hans Times, in their attempt to stay balanced or attempting to be in good books of Seemaandhra Capitalists, is earning the name of Seemaandhra Partisans. News Paper boy told me that they have been trained to ask the subscribers for Namasthe Telangana also to take Hans Times. I obliged for Two Months by subscribing to Hans Times then after I found the attitude of the News Paper Partisan towards Telangana issue. I immediately Stopped my subscription to Hans Times. After all the good name they earned by conducting DASHA – DISHA Program through out Andhra Pradesh is losing the Good Name.

  2. K.Mallikajrun says:

    it is absolutely correct.am also observing the transformation of HMTV after announcement of TG. there was huge faceshift. that why there is idiom in telugu” lankala puttinayi anni rakshasule”