హిందూ-సిక్కులమైత్రికి నిదర్శనం

లూధియానా, ఫిబ్రవరి 23: హిందువులు, సిక్కుల మైత్రికి బీజేపీ-శిరోమణి అకాలీదళ్ పార్టీల పొత్తే నిదర్శనమని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. గుజరాత్‌తో సిక్కులకు అవినాభావసంబంధం దానిని ఎవరూ వేరుచేయలేరని స్పష్టం చేశారు. హిందువులు, సిక్కులు కలిసి అవినీతి కాంగ్రెస్‌ను దేశంనుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లో సిక్కులను లక్ష్యంగా చేసుకుని.. వేధిస్తున్నారని వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

narenmodiకచ్ ప్రాంతంనుంచి సిక్కు రైతులను గుజరాత్ అధికారులు తరిమేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిరధారమన్నారు. ఒకవేళ ఎవరైనా అధికారి అలా చేస్తే.. ఆ అధికారినే తరిమేస్తామే తప్ప, సిక్కులను కాదని స్పష్టం చేశారు. తానెలా గుజరాత్‌లో ఉంటున్నానో.. దేశంలోని ప్రజలెవరైనా అక్కడ అలాగే ఉండవచ్చని అన్నారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు దేశ ప్రజలందరికీ ఉందని.. దీనిని నిరోధించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. ఇది బీజేపీ ప్రతిష్ఠను, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తును భగ్నం చేయడానికి కొందరు ఆడిస్తున్న నాటకమని పరోక్షంగా కాంగ్రెస్‌నుద్దేశించి ఆరోపించారు. పంజాబ్ ప్రజలు అభివద్ధిని చూసే ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు ఓటు వేశారని మోడీ పేర్కొన్నారు. ఆయన పాలనుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ రైతుల అభివద్ధి గురించి ఆలోచిస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ సాంకేతిక అభివద్ధిపై దష్టిసారిస్తారు.

ఫలితంగానే పంజాబ్ అన్నిరంగాల్లో అభివద్ధి దిశగా దూసుకుపోతున్నది అని పేర్కొన్నారు. ఆదివారం పంజాబ్‌లోని లూధియానాలో బీజేపీ సభలో నరేంద్రమోడీ ప్రసంగించారు. అవినీతి వ్యతిరేక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకపోవడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లెక్కలేనన్ని కుంభకోణాలు చోటుచేసుకోగా.. ఇతర పార్టీలపై బురద జల్లుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అవినీతి పునాదులున్న పార్టీలో ఉంటూ.. అవినీతి నిర్మూలన వీరుడిగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పంజాబ్‌లో జరిగిన అన్ని సభల్లో ఇదే భారీ బహిరంగ సభ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. 300 ఎకరాల్లో సభ నిర్వహించగా.. 10వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

మోడీ ప్రసంగం హైలైట్స్..
– కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలను ఏబీసీలుగా వర్గీకరించవచ్చు. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే బోఫోర్స్, సీ అంటే కోల్‌గేట్.
– రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ నుంచి పంచాయతీల వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అప్పుడు కేంద్రం ఒక రూపాయి విడుదల చేస్తే.. పంచాయతీలకు 15పైసలు మాత్రమే చేరుతున్నదని ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చే ప్రతి రూపాయిలో నాటినుంచి ప్రజలకు అందుతున్నది 15 పైసలే.. ఈ అవినీతి పార్టీని హిందువులు, సిక్కులు కలిసి తరిమేయాలి.
– ప్రజల ఆశీర్వాదంతో ప్రధానిని కాగలిగితే.. రాజ్యాంగం దష్టిలో, ప్రపంచ దేశాల దష్టిలో మాత్రమే నేను ప్రధానిని. దేశ ప్రజలందరికీ నేనొక సేవకుడిని. దేశ ఖజానాపై ఎవరి చేతులు పడకుండా అడ్డుకునే కాపలాదారుడి(చౌకీదార్)ని మాత్రమే.

– సైన్యంలో ఒక ర్యాంకు- ఒకే పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి. సైన్యంలో ఒకే ర్యాంకులో పనిచేసి పదవీవిరమణ పొందిన సైనికులకు పెన్షన్‌లో తేడాలు చూప డం ఏ మాత్రం సరికాదు. ఒక ర్యాంకు- ఒకే పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ ఇటీవలే పార్లమెంట్‌లో ఆమోదించింది. పదేళ్లుగా పదవిలో ఉండి.. ఎన్నికల సమయంలోనే ఈ బిల్లును ఆమోదించడం వెనుక రాజకీయాలున్నాయి.
– ఆహారధాన్యాలు తక్కువ ధరకు అమ్మేలా యూపీఏ ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తున్నది. గ్రెయిన్ డ్రెయిన్ దేశానికి సిగ్గుచేటు. రైతులకు మద్దతు ధర అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పత్రికలు, టీవీల్లో ప్రకటనలకే పరిమితమైంది.
– సుప్రీంకోర్టు చెబుతున్నా కేంద్రప్రభుత్వం పేదలకు గోధుమలు పంచదు.. మద్యం తయారీకి మాత్రం విరివిగా అందజేస్తుంది.
– వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవా రంగాలు మూడు దేశానికి మూలస్తంభాలు.

– నేను ఈ సభలో సిక్కు తలపాగా పెట్టుకున్నాను. దీని గౌరవం ఏమిటో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుతా.
– గురునానక్ గుజరాత్ వచ్చినప్పుడు ఆయన లఖపత్ గురుద్వారాను సందర్శించుకున్నారు. ఆ మధుర స్మతులను మేం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాం.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.