హాఫ్ నాలెడ్జ్ డిస్కషన్స్ బంద్ పెట్టండి

టీవీ9 ప్రతిపండగకు కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నది.  పండగలకు కులాల రంగు పులుముతున్నరు. ఇదివరకు రావణాసురుడు దళితుడని.. దసరా రోజు రావణవధ చేయడం ఓ కులాన్ని అవమానించడమేనని డిస్కషన్ పెట్టిన్రు. నిన్న నరకాసురుడు దళితుడని డిస్కషన్ పెట్టిన్రు. దళిత రాజులను చంపేసి  పండగ చేసుకుంటున్నరని చర్చ నడిపిన్రు.
ఈ డిస్కషన్ లు పెట్టిన వాళ్లు నిజానిజాలు తెలుసుకోవాలి. మీ కమ్యూనల్ భావాలను ప్రజలపై రుద్దొద్దు.
రావణాసురుడు దళితుడని టీవీ9కు చెప్పినోడెవ్వడు. రావణాసురుడు బ్రాహ్మణుడు. ఆయన పేరే రావణబ్రహ్మ.  నరకాసురుడు మహావిష్ణువు, భూదేవిల కొడుకు. పురాణాలు తెలుసుకోకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి పండగకు రభస చేయడం టీవీ9 కు అలవాటైంది.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to హాఫ్ నాలెడ్జ్ డిస్కషన్స్ బంద్ పెట్టండి

  1. Lokesh says:

    Thanks for writing this, Even Mahaa Tv also did simaliar things