హాత్ ఛోడో.. కార్ పకడో

 

Parliament
-టీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు టీ కాంగ్రెస్ ఎంపీలు
-కేసీఆర్‌తో భేటీ.. జూన్ 3న పార్టీలో చేరిక!
-ఫాంహౌస్‌కు వెళ్లి గులాబీ అధినేతను కలిసిన వివేక్, మందా, రాజయ్య, కేకే
-కేటాయించే నియోజకవర్గాలపై చర్చలు.. కేకేకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసాన్ని జీర్ణించుకోలేని ఈ ప్రాంత అధికారపార్టీ ఎంపీలు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకునేందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెలాఖరులోగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం ప్రకటించనట్లయితే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముగ్గురు ఎంపీలు, పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు సంసిద్ధత వ్యక్తం చేయడంతోపాటు సోమవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో చర్చలు జరిపారు. ఈనెల 30లోగా కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణను ప్రకటించనట్లయితే తమదారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇచ్చిన టీ కాంగ్రెస్ ఎంపీలు జూన్ 3న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానానికి అల్టిమేటం ఇస్తూ ముగ్గురు తెలంగాణ ఎంపీలు తీసుకున్న నిర్ణయంపై ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికలో వచ్చిన వార్తను చూసి కేసీఆర్ సోమవారం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కే కేశవరావుతో పాటు టీ కాంగ్రెస్ ఎంపీలు జీ వివేక్, మందా జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య సోమవారం మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలుసుకున్నారు. వారి మధ్య మూడుగంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఘడియకో మాట మాట్లాడుతున్నదని, ఒకసారి తెలంగాణ ఇస్తామని, మరొకసారి ఇవ్వమంటూ ప్రజల్లో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నదని కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. ‘పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. సస్పెండ్ అయ్యారు. తెలంగాణ సాధన కోసం ఏదోరకంగా ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్‌లో చలనం లేదు. ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైఖరి స్పష్టమైపోయింది. ఇక ఆ పార్టీలో కొనసాగడం అవసరమా?’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టీ కాంగ్రెస్ ఎంపీలను ప్రశ్నించారని తెలుస్తోంది. ‘కేంద్రం తెలంగాణ ఇచ్చేటట్లు లేదు. వీలైనంత త్వరగా రండి.

టీఆర్‌ఎస్‌లో చేరండి’ అని కేసీఆర్ వారికి సూచించినట్లు తెలియవచ్చింది. ‘మనందరి లక్ష్యం తెలంగాణ. ఈసారి కనుక వాళ్ళు (కేంద్రం) ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని, ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించేందుకు తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనాఉంది, మనమంతా కలిసి ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం’ అని టీ కాంగ్రెస్ ఎంపీలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ‘మీలాంటివారు వస్తే మా పార్టీ మరింత బలపడుతుంది’ అని అన్నారని తెలిసింది. వచ్చే సాధారణ ఎన్నికలలోపే తెలంగాణను సాధించాలన్నదే తమ ప్రయత్నమని, తాము నిర్దేశించుకున్న గడువులోగా అధిష్ఠానం నుంచి సానుకూల నిర్ణయం వెలువడని పక్షంలో కాంగ్రెస్‌ను వీడేందుకు ఎలాంటి సంశయం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేసినట్లు తెలిసింది. కేసీఆర్‌తో సమావేశం సందర్భంగా టీ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

సీనియర్ కాంగ్రెస్ నేత కే కేశవరావుకు ముందుగా టీ ఆర్‌ఎస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు పార్టీ అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల తదుపరి కేశవరావును రాజ్యసభకు పంపిస్తానని, కేకే కుమారుడిని రంగాడ్డి జిల్లా నుంచి అసెంబ్లీకి పంపేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీల్లో సిరిసిల్ల రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి శాసనసభ స్థానం, వివేక్‌కు ఎంపీ సీటుతో పాటు ఆయన సోదరుడికి బెల్లంపల్లి ఎమ్మెల్యే టిక్కెట్టు, మందా జగన్నాథంకు నాగర్‌కర్నూల్ ఎంపీ స్థానం, ఆయన కుమారుడికి అలంపూర్ ఎమ్మెల్యే స్థానం వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

సిట్టింగ్ ఎంపీలు ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలనే అంశంపై తుదినిర్ణయం తదుపరి సమావేశంలో చర్చించుకుందామని అధినేత వారికి సర్దిచెప్పినట్టు తెలిసింది. వరంగల్ లేదా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఈ నలుగురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్, వినోద్, కడియం శ్రీహరి కూడా ఉన్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా, వ్యవసాయ క్షేత్రంలో సాగుచేసిన పంటలను టీ కాంగ్రెస్ ఎంపీలకు కేటీఆర్ చూపించారు. పంటలసాగు తదితర అంశాలపై కూడా కేసీఆర్ ఎంపీలతో మాట్లాడినట్లు తెలిసింది. కేసీఆర్‌తో ఎంపీలు చర్చలు జరుపుతున్న విషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున వ్యవసాయక్షేవూతానికి తరలివచ్చారు. ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. ముందుగేటులో నుంచి వెళ్లిన ఎంపీలు కేసీఆర్‌తో చర్చల అనంతరం మరో గేటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో మీడియా ఉసూరుమంటూ వెనుదిరిగిరాక తప్పలేదు.

వివేక్ వైపే జిల్లా : తెలంగాణ అసలు యూపీఏ ఎజెండాలోనే లేదని, అది రాష్ట్రానికి సంబంధించిన విషయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో తన చిత్తం వచ్చినట్లు ప్రకటించిన నేపథ్యంలో టీఎంపీలు ఆదివారం హైదరాబాద్‌లో పెద్దపల్లి ఎంపీ జీ వివేకానంద్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివేక్‌తో సహా మంద జగన్నాథం, రాజయ్య తదితర ఎంపీలు కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించే విషయంలో ఇంకా జాప్యం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిన భారీగా నష్టం జరుగుతుందని భావించారు. ఇదే విషయాన్ని సమావేశం అనంతరం కూడా వారు ప్రకటించారు. కాంగ్రెస్‌కు ఇది తుది గడువు అని, ఈ నెల 30 లోపు తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో తమ దారేదో తాము చూసుకుంటామని, ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో వారి అభీష్టం మేరకు పాల్గొంటామని ఎంపీ వివేక్ ప్రకటించారు.

అయితే శనివారం రాత్రి వరకు కూడా నియోజకవర్గంలోని మంచిర్యాలలోనే ఉండి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తదితరులతో కలిసి గుడిపేట అగ్నివూపమాద బాధితులను పరామర్శించి వారికి సహాయ కార్యక్షికమాలు అందించిన ఎంపీ హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్ళి చాకో చేసిన ప్రకటనపై ఎంపీలతో సమావేశమై పై విధంగా ప్రకటించారు. సోమవారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీనియర్ నేత కేకే సహా జీ వివేకానంద్, జగన్నాథం, రాజయ్యలు కలిశారు. ఆయనతో ఫాం హౌజ్‌లో చర్చలు జరిపారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, తదితరులు కూడా ఈ చర్చలలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ వివేక్ టీఆర్‌ఎస్‌లోకి వెళితే.. జిల్లాలో సగం వరకూ కాంగ్రెస్ ఖాళీ అయిపోతుందని అంటున్నారు. వివేక్ టీఆర్‌ఎస్‌లో చేరే విషయం గత ఎనిమిది నెలలుగా చర్చ జరుగుతోంది. మొత్తం పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గంతోపాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనూ వివేక్ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్‌లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ ప్రధాన నాయకులు అందరు వివేక్ వెంటే ఉన్నారని అంటున్నారు. చాలా కాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వివేక్‌కు టీ జేఏసీ, సింగరేణి జేఏసీ, ఇతర జేఏసీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కిరణ్‌తో ఆయన తగాదాకు దిగారు. ఉద్యమానికి కాంగ్రెస్‌లో ఊతమివ్వడానికి కారణం వివేకేనని, వివేక్ కట్టర్ తెలంగాణ వాది అని అధిష్ఠానంలోనూ పేరుంది. ఇటీవల ఆయన ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా.. పార్టీకి రాజీనామా చేద్దామని పార్టీక్షిశేణులు, అనుచరుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. చాకో ప్రకటన తర్వాత అవి మరింత పెరిగాయి. వివేక్ ఏ పార్టీలో ఉంటే తాము అదే పార్టీలోకి వెళతామని పలువురు నేతలు చెబుతుండటం విశేషం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.