హాట్సాఫ్‌ హరీషన్న

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌): శ్రమదానం పేరుతో ఫొటోలకు ఫోజిలిచ్చి ఒక్క తట్ట మోసి.. చేతులు కడుక్కుని వెళ్లే నేతలను కోకొల్లలుగా చూసినం. లీడర్‌ అంటే ఫోజులిచ్చేవాడు కాదు.. లీడర్‌ అంటే పనిచేయించేవాడు కాదు.. తాను ముందువరుసలో పనిచేస్తూ తన అనుచరగనంతో పనిచేయించేవాడే నిజమైన లీడర్‌.. ఆ నిజమైన లీడరే హరీష్‌రావు అలియాస్‌ 108. రెండు రోజులుగా పొద్దంతా ప్రజలతో సమానంగా హరీష్‌ పనిచేసిన్రు.

పంటలను కాపాడుకునేందుకు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండల అల్లీసముద్రం కుంట చెరువు కట్ట పనులు చేస్తున్నరు. పంటలను నష్టపరుస్తున్న కోతులు, అడవి పందులను పట్టేవారికి కూలి ఇచ్చేందుకు చేపట్టిన చెరువు పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో 1500 మందికి పైగా రైతులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.  ఐదు గంటల పాటు శ్రమదానం చేసి చెరువు కట్ట పనులను 75 శాతం పూర్తి చేశారు..

అసెంబ్లీలో అదరగొట్టినా.. తెలంగాణ ఉద్యమంలో పోలీసులను దాటుకుని ముందుకు దూకినా.. ప్రజల సమస్యల కోసం నిత్యం అధికారులతో మాట్లాడినా.. హరీష్‌ స్టయిలే సెపరేట్‌.. రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా హరీష్‌రావు మారుతున్నరు.  పోరుతెలంగాణ తరపున హాట్సాఫ్‌ హరీషన్న

This entry was posted in ARTICLES, TELANGANA MONAGALLU, Top Stories.

6 Responses to హాట్సాఫ్‌ హరీషన్న

 1. shobha says:

  tng lo real leader .. poloitical leaders andariki role modal..

 2. kranthi says:

  great leader in t.g

 3. sanda sri says:

  great humanity with leadership quality,

 4. vinod says:

  sir,u r really great

 5. sandeepgoud says:

  Real leader