హమ్మయ్య.. బిల్లుపై చర్చ జరిగింది

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై ఎట్టకేలకు బుధవారం చర్చ జరిగింది. రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు వచ్చి 30 రోజులు కావస్తున్న తరుణంలో బిల్లుపై చర్చ కొనసాగించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు మినహా అంతా సిద్ధపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం తమకే దక్కాలన్న వైఖరితో వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు.. ఎప్పటిలాగే చర్చకు అడ్డుపడ్డారు. చర్చను వ్యతిరేకిస్తూ.. ముసాయిదా ప్రతులను సభలోనే చింపివేశారు. అయినా వారి చర్యలను పట్టించుకోని స్పీకర్ నాదెండ్ల మనోహర్.. చర్చను కొనసాగించేందుకే సిద్ధమయ్యారు. బుధవారం బిల్లుపై చర్చను సీమాంధ్ర ప్రాంత మంత్రి వట్టి వసంతకుమార్ ప్రారంభించారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ అభివూపాయానికి వచ్చిన ముసాయిదా బిల్లుపై సభ్యులు రాష్ట్రపతి కోరిన మేరకు అభివూపాయాలు చెప్పాల్సి ఉంది. అది సానుకూలమా? వ్యతిరేకమా? అన్నదాంతో నిమిత్తం లేకుండానే కేంద్రం తన నిర్ణయం తాను తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ కొనసాగడంపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎప్పటిలాగే సభ ప్రారంభంకాగానే సీమాంధ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. ఈ సమయంలో తెలంగాణ, సమైక్య ఉద్యమాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై టీడీపీ, సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్సార్సీపీ, పాలెం బస్సు బాధితులకు పరిహారంపై సీపీఐ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.

పోడియం వద్ద ఉన్న సభ్యులను తమ స్థానాల్లో కూర్చొనాలని, సభకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. ప్రజల అభివూపాయం ఏమిటో సీట్లలోకి వెళ్లి చెప్పాలని కోరారు. అయినప్పటికీ సభ అదుపులోకి రాకపోవడంతో గంటపాటు వాయిదా వేశారు. తిరిగి సభ 11.05 గంటలకు ప్రారంభమైంది. అప్పుడూ పరిస్థితిలో మార్పు రాలేదు. రెండో విడత సమావేశాల్లో కూడా సభ మర్యాదను, సంప్రదాయాలను సభ్యులు పాటించకపోవడం సరైంది కాదని స్పీకర్ అన్నారు. సభ నిర్వహణకు అవకాశం లేకపోవడంతో రెండోసారి సభను వాయిదా వేశారు. తిరిగి సభ 1.45 గంటలకు మొదలైంది. ఈ సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టారు. జై తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు మారుమోగాయి. ఒకవైపు సభ్యులకు విజ్ఞప్తి చేస్తూనే.. తమ తమ పార్టీల ఎమ్మెల్యేలను వెనక్కి పిలవాలని ఆయా పార్టీల సభాపక్ష నేతలను స్పీకర్ కోరారు.

ఈ సమయంలో టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు తాము అడిగిన సమాచారం తెప్పించి ఇవ్వాలని అడిగారు. దీనిపై ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణడ్డి స్పందిస్తూ కేంద్రం నుంచి రెండుమూడు రోజుల్లో బిల్లులోని సమగ్ర సమాచారం తెప్పించి ఇస్తామని చెప్పారు. స్పీకర్ (మొదటి పేజీ తరువాయి)మరోసారి విజ్ఞప్తి చేయడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు వారివారి స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాత్రం పోడియంను వదిలి వెళ్లడానికి సిద్ధపడలేదు. బిల్లు పత్రులను చింపి గాల్లోకి విసిరేస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అయినప్పటికీ స్పీకర్ పట్టించుకోకుండా మంత్రి వట్టి వసంత్‌కుమార్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.

మంత్రి చర్చలో పాల్గొంటూ ముసాయిదా బిల్లు ఆంధ్ర, రాయలసీమ ప్రజల అభివూపాయాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. అందుకే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజ్యాంగేతర, అప్రజాస్వామిక పద్ధతిలో ఈ విభజన జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధమని చెప్పారు. వట్టి వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు లేచి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బిల్లు పత్రులను చింపి గాల్లోకి విసరడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు.

ఇలా జరిగింది!
ఎట్టకేలకు చర్చ కొనసాగడంతో ఇప్పటి వరకూ జరిగిన డ్రామాలకు తెరపడినట్లయింది. డిసెంబర్ 12న శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా, 13న ముసాయిదా బిల్లును సభలో చేశారు. అదే రోజు డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఆనాటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆ తరువాత స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్షికమార్క ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును మాట్లాడాలని ఆహ్వానించారు. అయితే బాబు మాట్లాడానికి ఆనాడు ముందుకు రాలేదు. మరోవైపు సీమాంవూధకు చెందిన సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభ్యుల ఆందోళనలు, నిరసనల మధ్య ఆనాడు సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.

నాటి నుంచి నేటి వరకు వాయిదాల పర్వం కొనసాగుతూ వచ్చింది. బిల్లుపై చర్చ జరిగినా జరుగకపోయినా గడువు ముగిశాక ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి వెళ్లిపోవడం తథ్యమని తేలిపోవడంతో సీమాంధ్ర ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ఒకప్పుడు అసెంబ్లీలో చర్చ వద్దేవద్దని, బిల్లు పెట్టిన రోజే మెరుపు సమ్మెకు దిగుతామని బెదిరించిన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు సైతం చర్చ జరగాలనే డిమాండ్ ముందుకు తెచ్చారు. చర్చ జరిగితేనే తమ ప్రాంత అభ్యంతరాలు చెప్పుకునే వీలుంటుందని గుర్తించిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమయ్యారు. సీమాంధ్ర టీడీపీ సభ్యుల్లోనూ ఇదే ఆలోచన రావడంతో పార్టీ అధినేత అనుమతి తీసుకున్న నేతలు.. సర్కారును ఒప్పించేందుకు చొరవ చేశారు. బుధవారం పలుమార్లు స్పీకర్‌ను కలిశారు. ప్రభుత్వంతో పాటు ఇతర పార్టీలతో కూడా మాట్లాడాలని స్పీకర్‌ను కోరారు. టీడీపీ టీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌డ్డి, రేవంత్‌డ్డి, విజయరమణారావులు కూడా బిల్లుపై సభలో చర్చించాలని స్పీకర్‌ను కోరారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలతో కలిసి పలుమార్లు ఆందోళనలు చేశారు. తెలంగాణకు చెందిన దాదాపు అన్ని పార్టీల సభ్యులు కూడా ఇదే విధంగా బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు. బిల్లుపై సభలో చర్చించకపోతే తమ అభివూపాయాలను రాతపూర్వకంగా ఇస్తామని అన్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ, సీమాంధ్ర నేతలకు విడివిగా డైరెక్షన్లు ఇస్తూ చర్చ జరిగేందుకు పరోక్షంగా సహకరించారు. వీటి పర్యవసానంగా ప్రభుత్వంతో స్పీకర్ మాట్లాడారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలో టీడీపీ సీమాంధ్ర సభ్యులు అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, ఉద్యోగుల వివరాలు, నదీజలాల వివాదాలకు చెందిన సమాచారాన్ని టీడీపీ సభ్యులు అడిగారు. తమ వద్ద ఉన్న సమాచారం రెండు రోజుల్లో ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సభలో ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. దీంతో మెత్తబడిన టీడీపీ సీమాంధ్ర సభ్యులు పోడియం వదిలి.. తమ స్థానాల్లో కూర్చున్నారు. తన మొండివైఖరి వీడేది లేదన్న వైఎస్సార్సీపీ మాత్రం సమైక్య తీర్మానం చేసిన తర్వాతే చర్చ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల్లోనే వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. చర్చను స్పీకర్ కొనసాగిస్తూ వట్టి వసంతకుమార్‌కు అవకాశం ఇచ్చారు.

చర్చించాలి సీమాంధ్ర టీడీపీ
ఉన్న కొద్ది రోజులైనా సభలో బిల్లుపై చర్చించి సవరణలు ప్రతిపాదించాలని సీమాంవూధకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు భావిస్తున్నారు. చర్చల్లో ప్రతిక్లాజుపై చర్చించాలని, ఈ మేరకు సవరణలు ప్రతిపాదించడంతో పాటు ఓటింగ్ పెట్టి బిల్లును వ్యతిరేకించాలని టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. బిల్లులో లోపాలను ఎత్తి చూపడానికి చర్చే ఉత్తమ మార్గమని వారు అంటున్నారు. బిల్లుపై చర్చకు నిర్దిష్టంగా 40 గంటల సమయం మాత్రమే ఉన్నదని, దీనిని పూర్తిగా వినియోగించుకుంటామని సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ చర్చ ద్వారా బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెపుతామన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.