హఠ్‌.. సాలా!!-రత్నశ్రీ

సామూహిక మానభంగం
ఆరున్నర దశాబ్దాల వసంతం
అర్ధరాత్రి  కూకటివేళ్లతో పెకిలిపోయింది
సూర్యుడు తెల్లారి భళ్లున నవ్వాడు
నెత్తుటి పుష్పంమీద ఫోటో ఫ్లాష్‌
సిరామిక్‌ నునుపులో ఎర్ర కలువలు
దండకారణ్యంలో శోకవచనం
ఎవడో పాటకట్టి లూప్‌లో పెట్టాడు
ఏకాకి కీచురాయి భీతావహ స్వప్నం
దయచేసి అందరూ వెళ్లిపోండి

కాసేపట్లో ఇక్కడ
ఎన్‌కౌంటర్‌ జరగబోతోంది
హఠ్‌.. సాలా!

-రత్నశ్రీ

This entry was posted in POEMS.

Comments are closed.