హకేష్ కుమార్

15″ height=”300″ class=”alignleft size-medium wp-image-463″ />ఆయన పేరు ముఖేష్‌కుమార్…కానీ హాకేష్‌కుమార్ అని పిలవొచ్చు.ఆటలో వేగం.. స్టిక్‌లో పవర్… రెండూ కలిస్తే ముఖేష్‌కుమార్ ఆయన టీమ్‌కు కాన్ఫిడెన్స్ టానిక్… ప్రత్యర్థులకు ఆరడుగుల టెన్షన్ కెరీర్‌లో ‘హై ప్రొఫైల్’ ఉన్నా లైఫ్ ‘లో ప్రొఫైల్’గా కనిపించే సగటు వ్యక్తి అందుకే ముఖేష్‌కుమార్ అవార్డులు తీసుకున్నప్పడు ఎగిరి గంతేయలేదు అనుకోని అవమానాలు ఎదురైనప్పుడు హర్ట్ కాలేదు నిజమైన స్పోర్ట్స్‌మేన్‌లా, నిఖార్సైన మనిషిలా ఇప్పటికీ హాకీ కోసమే ఆరాటపడుతున్నాడు హాకీ ప్లేయర్ ముఖేష్‌కుమార్ అంటే భారతదేశం గుర్తొస్తది ఇతర దేశాలవాళ్లకు. దేశం కోసం పదహారు సంవత్సరాలు నిర్విరామంగా ఆడిన క్రీడాకారుడు ఆయన. భారత జట్టుకు ముఖేష్ అందించిన విజయాలు ఎన్నో. కానీ ఆయన ప్రతిభకు, కీర్తికి తగినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది. కారణం ఆయన కమర్షియల్ కాలేకపోయాడు. అదీ కూడా ఒకరకమైన సక్సెస్‌గానే భావించాలి. ముఖేష్ లైఫ్ సికిందరాబాద్ సిక్‌విలేజ్‌లో మొదలైంది. పదహారేళ్లకు కెరీర్ ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆటగాడిగా 2005లో రిటైర్ అయిన ముఖేష్ మొన్నటిదాకా భారత జూనియర్ హాకీ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

ఎప్పుడూ చేతిలో హాకీ స్టిక్‌తో కనిపించే ముఖేష్‌కుమార్‌కు చిన్నప్పటి నుంచి హాకీ అంటే ప్రాణం. మహబూబియా కాలేజ్‌లో చదువుతున్నప్పటి నుంచే కార్నేషన్ క్లబ్ తరఫున ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడేవాడు. మహబూబియా కాలేజ్ హాకీ టీమ్ అంటే స్ట్రాంగ్ టీమ్. ఆయనకు పదహారేళ్ల వయసప్పుడు మచిలీపట్నంలో జరిగిన హాకీ టోర్నమెంట్స్‌కు హైదరాబాద్ రూరల్ జట్టు తరఫున వెళ్లాడు. ఆయన చేతిలో స్టిక్ చెలరేగిపోయింది. చండవూపచండుడిగా కనిపించాడు అక్కడికి వచ్చిన కోచ్‌లకు. చురుకైన కుర్రాళ్లను వాళ్ల హాస్టల్‌లో చేర్చుకోవడానికి ఇట్లాంటి మ్యాచ్‌లకు వస్తుంటారు. వాళ్లు ఎంపిక చేసుకున్న వాళ్లకు మళ్లీ టెస్ట్ పెడతారు. కానీ ముఖేష్‌కుమార్ ఆట చూశాక నేరుగా హాస్టల్‌లో సీటు ఇచ్చారు. ప్రాక్టీసులోకి దింపారు. మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గెలుస్తున్నాడు. పేరు క్రమంగా బయటకొస్తుంది. ఒకరోజు ఇండియన్ ఎయిర్‌లైన్‌లో జాయిన్ కమ్మంటూ ఆఫర్ వచ్చింది. అదే ఆయన లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అయ్యింది. ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’లో జాయిన్ అయ్యాడు. ఆ టీమ్‌లో పెద్ద పెద్ద హాకీ ప్లేయర్స్ ఉండేవాళ్లు. అసలు అంతటి ఆటగాళ్లను చూడవచ్చనే కోరికతోనే ముఖేష్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకున్నాడట. అక్కడ సీనియర్ ప్లేయర్స్‌ను చూస్తుంటే ఆయనలో ఒకరకమైన ఉత్తేజం. సీనియర్ ఆటగాళ్లను చూసినప్పుడల్లా ముఖేష్‌కు అంటుకున్న మంచి లక్షణం… ఆటలో కాన్ఫిడెంట్‌గా ఉండగలగటం! 19లో హాకీ వరల్డ్‌కప్‌లో ముఖేష్ వల్లే ఇండియా గెలిచింది పాకిస్తాన్ మీద.

హాకీ ఫ్యామిలీ…
ముఖేష్ వాళ్ల తాత, తండ్రి కూడా హాకీ ప్లేయర్సే. దాంతో సహజంగానే ఆయనకు హాకీ మీద ఆసక్తి ఏర్పడింది. పుట్టి పెరిగిన సిక్ విలేజ్‌కు ఒక ప్రత్యేకత ఉండేది. ఆ ప్రాంతం వాళ్లు హాకీ వీరులు. పైగా వీళ్ల ఇంటిముందే గ్రౌండ్ ఉండేది. ఇక్కడి వాళ్లు చాలామంది కార్నేషన్‌క్లబ్‌కు ఆడేవాళ్లు. ఎక్కడ సెలెక్షన్స్ జరిగినా ఆ క్లబ్‌వాళ్లే ఏడెనిమిది మంది ఉండేవాళ్లు. అయితే ముఖేష్ హాకీనే నమ్ముకోవడానికి మాత్రం ఒక్కటే కారణం… ఆయన చదువులో 35 మార్కుల స్టూడెంట్ కావడం. అందుకే హాకీ స్టిక్ అందంగా కనిపించింది. హాకీలో ఆయన సాధించిన విజయాలు అనేకం.

టూ మిస్టేక్స్ ఆఫ్ లైఫ్…
సెలవూబిటీగా ఉండాల్సిన ఆయన సాదాసీదా సగటు వ్యక్తిగానే ఉంటున్నాడు. ఇద్దరు ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్స్(ఆయన భార్య నిధి ముఖేష్ కూడా హాకీ ప్లేయరే) ఉన్న కుటుంబం. ముఖేష్ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజర్. ఆయన భార్య రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది. హ్యాపీ లైఫ్‌లా అనిపిస్తున్నా.. ‘టూ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్’ అంటూ రెండు విషయాలు ప్రస్తావిస్తాడు ముఖేష్. ఒకటి పాప పుట్టిన తర్వాత నిధిని హాకీ మ్యాచ్‌లకు దూరంగా ఉంచడం, ఇంకోటి అకాడమీ కోసం ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలం విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం! మొదటిది తన వ్యక్తిగత విషయమైతే, రెండోది మాత్రం కోచ్‌గా అకాడమీని రన్‌చేసే అవకాశం లేకుండా చేసింది.నిధి 2000 సంవత్సరం వరకూ ఇండియా తరఫున ఆడింది. తను ఆడుతున్నప్పుడు పాపను చూసుకోవడం ముఖేష్ వంతు అయ్యింది. ఆ క్రమంలోనే ఆమెను వారించాడు. అప్పటి నుంచి గేమ్ ఆపేసింది. ఫీల్డ్‌లో లేదనే కారణంగా ఆ ఏడాది నిధి అర్జున అవార్డు మిస్సయింది. అదే సంవత్సరం కామన్ గేమ్స్‌లో భారత మహిళా హాకీ జట్టు గోల్డ్‌మెడల్ సాధించింది. ఒక్కొక్కరికి ఇరవై ఒక్క లక్ష రూపాయల నజరానా లభించింది. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్స్ కూడా ఇచ్చారు. అప్పటికి రైల్వేలో జాబ్‌చేస్తున్న నిధికి ప్రమోషనూ మిస్సయింది.

ఇక రెండో విషయం.. హాకీ అకాడమీ! అది 2000-01 సంవత్సరంలో ఐదెకరాల స్థలం ప్రభుత్వం నుంచి మంజూరైంది. సరైన ప్లానింగ్ లేక ప్రైమ్‌ల్యాండ్ సాధించుకోలేకపోయాడు. ఇంటికి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో శామీర్‌పేటలో స్థలం తీసుకున్నాడు. కానీ ఆయనకు స్పాన్సర్స్ కరువయ్యారు. అందుకే ఆయనంటాడు… గచ్చిబౌలి వైపు గనక ఆ స్థలం తీసుకోగలిగితే ఈపాటికి హైదరాబాద్‌లో హాకీ అకాడమీ దేదీప్యమానంగా వెలిగిపోయేదని! అకాడమీ కట్టని కారణంగా ఇప్పుడా స్థలం మళ్లీ ప్రభుత్వాధీనంలోకి వెళ్లింది. అయితే ఇక్కడే అసలు సమస్య! ఆ స్థలం చేతికి రావాలంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 65 లక్షలు కట్టాల్సి ఉంది. కానీ, అంతటి ఆర్థిక పరిస్థితులు లేవు ముఖేష్‌కు. హాకీ కమర్షియల్ గేమ్ కాని కారణంగా స్పాన్సర్స్ ముందుకురాకపోవడం అసలైన విచారం.

అదే తత్వం…
చిన్నప్పటి నుంచి సున్నితమైన ఆలోచనలతో ఉండే ముఖేష్ ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా ఫేమస్ అయిన తరువాత కూడా అదే ప్రవర్తనతో ఉన్నాడు. ఆడంబరాలకు పోనీ ఆయన తత్వం సెలవూబిటీగా హల్‌చల్ చేయడానికి ఉత్సాహం చూపలేదు. స్పోర్ట్స్ ఫంక్షన్లు తప్ప ఏ పార్టీలయినా, ఫంక్షన్లయినా అవాయిడ్ చేసేవాడు. అందుకే పెద్ద పెద్దవాళ్లతో కలువలేకపోయాడు. వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్నాయి తప్పితే చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలైతే ఒక్కటీ లేదు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడంటే మళ్లీ బయటకు వెళ్లని ముఖేష్ ఫ్యామిలీకే ఎక్కువ టైం కేటాయిస్తాడు. ‘నేను ఏ పదవులకూ, ప్రశంసలకు ఎప్పుడూ ఆశపడలేదు. కానీ నాకున్న లక్ష్యం… ఇండియాకు మంచి అంతర్జాతీయ హాకీ క్రీడాకారులను అందించడం. ఆ విషయంలోనే బాధగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అకాడమీ కట్టడానికి స్పాన్సర్స్ కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా సరే ఇప్పటికీ అదే ప్లాన్‌లో ఉన్నా. అయితే హాకీ ప్రధానంగా ఇంకో రెండు మూడు గేమ్స్ చేర్చి పక్కా ప్రొఫెషనల్‌గా అకాడమీ రన్ చేయాలనుకుంటున్నా. ఎన్ని చేసినా నాకు గుర్తింపు వచ్చింది హాకీతోనే కాబట్టి నేనేం చేసినా హాకీ కోసమే’ అంటాడు ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్‌కుమార్.

లవ్ మ్యారేజ్
19లో ఏషియన్ గేమ్స్ కోసం బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు మొదటిసారి చూశాడు నిధిని. వాళ్ల పరిచయం కూడా విచివూతంగా జరిగింది. కామన్ గేమ్స్ అప్పుడు హాస్టల్ పై పోర్షన్‌లో ముఖేష్ అండ్ టీమ్, కింది పోర్షన్‌లో గాళ్స్ టీమ్ ఉండేది. ఒక సందర్భంలో పై నుంచి నీళ్లు పోశాడు ముఖేష్ టీమ్‌లో ఒకతను. అవి నిధి ఆరేసుకున్న బట్టలపై పడ్డాయి. ఆమె ఆవేశంగా పైకి చూసేసరికి ముఖేష్ కనిపించాడు. చెడామడా తిట్టేసింది. కాసేపు ఆశ్చర్యంలో ఉన్నా తేరుకుని ముఖేష్ కూడా గొడవకు దిగాడు. సద్దుమణిగాక ఇద్దరూ భయపడ్డారు.. తరువాత ఏం జరుగుతుందోనని. కానీ నిధి వచ్చి ముఖేష్‌కు సారీ చెప్పింది. కట్‌చేస్తే..
ఓ శుభముర్తాన ముఖేష్ నిధికి ప్రపోజ్ చేశాడు. ఆమె సందిగ్ధంలో పడిపోయింది. సరిగ్గా 25 రోజుల తరువాత తన కోచ్‌కు నిధిని ప్రేమిస్తున్న సంగతి తెలిసి, నిధి వాళ్ల నాన్నతో మాట్లాడాడు. ఆ తరువాత ఇండియా టీమ్ ముందే వాళ్లిద్దరూ రింగ్‌లు మార్చుకున్నారు. అంటే ఎంగేజ్‌మెంట్ అన్నమాట! తరువాత ప్ళ్లైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. కూతురు యశస్విని. గోపిచంద్ అకాడమీలో షటిల్ ప్లేయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నది. కొడుకు అశుతోష్ ఇంకా చిన్నవాడే!

– ఇంటర్నేషనల్ మ్యాచెస్ -327
– 2001లో ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ – 1992లో బార్సిలోనా ఒలింపిక్
– 1996లో అట్లాంటా ఒలింపిక్
– 2000లో సిడ్నీ ఒలింపిక్
– 1994లో సిడ్నీ వరల్డ్ కప్
– 199లో హాలండ్ వరల్డ్ కప్
– 199లో జపాన్ ఎషియన్ గేమ్స్
– 199లో బ్యాంకాక్ ఎషియన్ గేమ్స్
– 1992లో జపాన్ ఆసియా కప్
– 1996లో మలేషియా ఆసియా కప్
– 199లో కామన్ గేమ్స్ మలేషియా
అవార్డ్స్:
– 1996లో అర్జున అవార్డ్
– 2003లో పద్మశ్రీ అవార్డ్
– 2003లో తెలుగు ఆత్మ గౌరవం
-2005లో రాజీవ్‌గాంధీ యూత్ అవార్డ్

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.