వరంగల్: ‘హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు, దానికి నీటి కేటాయింపు కూడా అక్రమమే’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపు విషయంలో సీఎం, ప్రతిపక్షనేత, వైసీపీ నేతలు అందరూ తోడు దొంగలేనని ఆయన విమర్శించారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. హంద్రీనీవా పేరుతో కృష్ణా నీటిని అక్రమంగా తరలించుకు పోతూ తెలంగాణ రైతుల నోళ్లు కొడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటిని ఎందుకు విడుదల చేయడంలేదో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటిని అక్రమంగా తరలించుకు పోతుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు సీమాంధ్ర నేతలకు వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు: హరీష్‌రావు
Posted on November 23, 2012
This entry was posted in TELANGANA NEWS, Top Stories.