స్ట్రయిక్ ఫర్ లైఫ్… జీతాలివ్వనందుకు నిరసనగా చానల్ స్టూడియోలోనే బోర్డింగ్, లాడ్జింగ్

మన దగ్గర జీతాలివ్వకపోతే ఏం చేస్తరు..  యాజమాన్యాన్ని బతిలాడుతరు. వాళ్లు స్పందించకపోతే వేరే చానల్ లోకి జంప్ అయితరు. జీతాలు కట్ చేసినా.. కోతలు విధించినా అన్నీ మూస్కుంటరు. అదే యాజమాన్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం గొంతు చించుకుంటరు. అరెస్ట్ అయితరు. జైళ్లకు పోతరు. అదే వాళ్లకు సమస్యలొస్తే మాత్రం సైలెంట్ అయిపోతరు. జర్నలిస్టు సంఘాలు సైతం యాజమాన్యాలకు సమస్యలొస్తే స్పందించి ప్రెస్ మీట్లని.. మీడియా స్వేచ్ఛ అని నోరు బొంగురు పోయేలా మైకుల ముందు ఊదరగొడుతయి. జర్నలిస్టుల ఉద్యోగాలు తొలిగించినా.. జర్నలిస్టులకు ఏ ప్రాబ్లం వచ్చినా సంఘాల నాయకులు పట్టించుకోరు.


కానీ కేరళ జర్నలిస్టులు అట్ల కాదు. నాలుగు నెలల నుంచి జీతాలివ్వని ‘టీవీ న్యూస్’ చానల్ పై యుద్ధం ప్రకటించిన్రు. చానల్ ఆఫీసులోనే వంటావార్పు మొదలుపెట్టిన్రు. అక్కడే తిని అక్కడే పడుకుంటున్నరు.   ‘స్ట్రయిక్ ఫర్ లైఫ్ ’  పేరుతో 45 రోజులుగా స్టూడియోలోనే ఉంటూ ఆందోళన కొనసాగిస్తున్నరు. యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నరు. పలు జర్నలిస్టు సంఘాలు వారి పోరాటానికి మద్దతు తెలిపినయి.

తెలుగు జర్నలిస్టులు కూడా కేరళ జర్నలిస్టులను ఆదర్శంగా తీస్కుంటే వాళ్ల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

Tv New 4్దష

Tv New 5

Tv New 1

 

 

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.