స్టాంప్ డ్యూటీ తగ్గింపు

రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌డ్డి రెవెన్యూ(వాణిజ్య పన్నులు) శాఖ ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఆస్తుల అమ్మకాలపై 5 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. స్టాంప్ డ్యూటీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాదిలో తాత్కాలికంగా రూ.200కోట్ల మేరకు రెవెన్యూ తగ్గనున్నా.. భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.