సోమవారం బిల్లు వచ్చే అవకాశం: జైరాం రమేష్

న్యూఢిల్లీ: సోమవారం శాసనసభకు తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారిగా బ్రిజేశ్‌కుమార్ నీటి కేటాయింపులు చేస్తారని పేర్కొన్నారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని తేల్చిచెప్పారు.జల వనరులపై బిల్లులో చెప్పినట్లు అమలు చేస్తే ఇబ్బందులు తలెత్తవన్నారు. సీమాంధ్రలో ఉన్నత విద్యా వర్సిటీలన్నింటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజిని సిఫార్సు చేశామని చెప్పారు. అసెంబ్లీ అభిప్రాయాలను మంత్రివర్గంలో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజల స్వేచ్ఛ, అంతర్గత భద్రత, ఆస్తుల రక్షణపై తుది నిర్ణయం ఉమ్మడి గవర్నర్‌దేనని తెలిపారు. వారి భద్రతపై గవర్నర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఇద్దరిని నియమిస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో 165 గ్రామాలు పోలవరం ముంపునకు గురైతున్నాయి. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపితే పాల్వంచ డివిజన్‌లోని 31 గ్రామాల పరిస్థితి ఎలా అని జైరాం ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.