సోనియా సంపద 200 కోట్ల డాలర్ల- హఫింగ్టన్ పోస్ట

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నాయకుల్లో సోనియాగాంధీ కూడా ఒకరంటూ హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ విడుదల చేసిన సర్వే సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలోని 20మంది అత్యంత ధనవంతులైన దేశాధినేతలు, నాయకుల సంపద వివరాలు వెల్లడించిన హఫింగ్టన్ పోస్ట్ వెబ్‌సైట్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 200కోట్ల డాలర్ల సంపదతో 12వ స్థానంలో నిలిచారని పేర్కొంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్, మొనాకో యువరాణి అల్బర్ట్ వంటి కుబేరులను సైతం వెనక్కునెట్టి సోనియాగాంధీ 12వ స్థానం పొందటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సర్వేలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానంలో నిలువగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా సర్వే దరిదాపుల్లో కూడా లేకపోవటం విశేషం. చమురు ప్రధాన ఆదాయంగా గల దేశాధినేతలు, రాజులే ఎక్కువమంది ఈ సర్వేలో చోటు సంపాదించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారమే జాబితా విడుదల చేశామని ప్రకటించిన హఫింగ్టన్‌పోస్ట్, ఆ 20మంది నేతలకు అంత సంపద ఎలా సమకూరిందనే వివరాలు మాత్రం తెలియవని పేర్కొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.