సోనియా గాడిదలు కాస్తున్నారా?: నారాయణ

– భిన్నాభివూపాయాలు విన్నాక కూడా నిర్ణయం చెప్పందుకు? – నాన్చితే నష్టపోయేది మీరే!.. వాయిదాలతో సాగదీయడాలొద్దు – లీకు వ్యాఖ్యలు సీఎం నేరుగా చేసుంటే తోలు తీసేవాళ్లం

తెలంగాణపై భిన్నాభివూపాయాలు వింటున్న కాంగ్రెస్ అధినేత్రి చెవిలో ఏం పెట్టుకున్నారో తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఏ నిర్ణయం వెలువరించకుండా ఆమె గాడిదలు కాస్తున్నారా? అని నిలదీశారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ CPIఏర్పాటుచేయాలని ఆయన సోమవారం అఖిలపక్ష నేతలతో సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సమైక్యవాదులు.. ఇవ్వకుం పెరుగుతుందని తెలంగాణవాదులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని చెప్పారు. అసలు నక్సలిజానికి, తెలంగాణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అసందర్భ వాదనలతో రెండు ప్రాంతాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే సోనియా ఏంచేస్తున్నారన్నారు. సామాజిక, ఆర్థిక, అసమానతలవల్లే నక్సలిజం పుట్టిందన్నారు. బోడిగుండుకూ.. మోకాలికిలంకె పెట్టి తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. నక్సలిజాన్ని భూతద్ధంలో పెట్టి తెలంగాణను తప్పుదోవ పట్టించేలా నివేదిక ఇచ్చిన సీఎం కిరణ్ ఒక ప్రాంత సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం అధిష్ఠానానికి ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు వచ్చిన లీకులు ఆయనే నేరుగా చేసుంటే తోలుతీసేవాళ్లమని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం అసలు నిర్ణయాన్ని పక్కనపెట్టి సీడబ్ల్యూసీపైకి తోసి సాకు చూపుతోందన్నారు. కావాలనే వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క కడప జిల్లాల్లో బ్రహ్మణీ స్టీల్స్‌కు కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఉక్కు పరిక్షిశమ ఏర్పాటుచేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇందుకు సీఎం సానూకూలంగా స్పందించారని తెలిపారు. అనారోగ్యం, వృద్ధాప్యంతో పలువురు జీవిత ఖైదీలు జైళ్లల్లో మగ్గుతున్నారని, వారికి క్షమాభిక్ష ప్రసాదించి ఆగస్టు 15న విడుదల చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. కాగా, తెలంగాణ అంశాన్ని నక్సలిజంతో ముడిపెట్టడం అత్యంత దుర్మార్గమని నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఇప్పటిది కాదని, ప్రజలు కొత్త రాష్ట్రాన్ని కోరడంలేదని.. గతంలో ఉన్న రాష్ట్రాన్నే పునరుద్ధరించాలని కోరుతున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ప్రజావాణి కార్యక్షికమానికి హాజరై వివిధ అభివృద్ధి పనుల్లో జాప్యంపై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన ఈ మేరకు విలేకరులకు తెలిపారు. లీకు వీరులారా.. రాష్ట్రం అడ్డుకోకండి తెలంగాణ ఏర్పడే సమయంలో నక్సలైట్ల అంశాన్ని బూచిగా చూపి లీకు వీరులు రాష్ట్రాన్ని అడ్డుకోవడం సరికాదని నారాయణ అన్నారు. వారికోసం సోమవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. నక్సలైట్లు బూత పిశాచాలా? మైన్స్, మద్యం, విద్యుత్, గ్యాస్, బొగ్గు మాఫియా కన్నా ప్రమాదకారులా అని ప్రకటనలో ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ప్రసంగాన్ని ఉటంకిస్తున్న లీకు వీరులు.. మరి నెహ్రూ నిజామాబాద్ జిల్లాలో చెప్పిన మాటలను ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. దుర్మార్గపు ప్రచారాలు ఆపేసి ప్రత్యేక రాష్ట్రానికి సహకరించాలి కోరారు. …

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.