సోనియాను విమర్శిస్తే పుట్టగతులుండవు : పొన్నం

అర్హత ఉన్నా లేకున్నా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సోనియా సీఎం చేశారు. కానీ కిరణ్ కు కొంచెం కూడా విశ్వాసం లేదని పొన్నం మండిప్డడరు. తెలంగాణ ప్రజల కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎవరు విమర్శించిన వారికి పుట్టగతులుండవు అని  హెచ్చరించారు.ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగద. పది జిల్లాల తెలంగాణ ఏర్పడటం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రక్రియ ఆగదని పొన్నం అన్నరు. జగన్, చంద్రబాబు అనవసరంగా సోనియాను విమర్శిస్తున్నారు. సోనియాను విమర్శిస్తే పుట్టగతులుండవు. సీమాంధ్ర నేతలంతా ఏకమై తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాబు అర్థంపర్థం లేని మాట్లాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి జీవోఎంకు ఎందుకు నివేదిక ఇవ్వలేదు?. మోత్కుపల్లి, ఎర్రబెల్లి ఇప్పటికైనా కళ్లు తెరవండి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు, జగన్ దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజల్లాగా కనిపించడం లేదా?. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. చంద్రబాబుకు ప్రజాస్వామ్య విలువలు తెలియవు. విభజనకు అందరూ సహకరించాలని పొన్నం కోరిన్రు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.