సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులతో సహా 10 జనపథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. భార్య, కూతురు, కుమారుడు, అల్లుళ్లు, మనవళ్లతో సహా పన్నెండు మంది కుటుంబ సభ్యులు వెంటరాగా సోనియాగాంధీని కలుసుకున్న కేసీఆర్ దాదాపు 20 నిమిషాల పాటు మేడమ్ నివాసంలో గడిపారు.

రాష్ట్ర ప్రకటన ద్వారా తెలంగాణ బిడ్డల బలిదానాల పరంపరకు అడ్డుకట్టవేసి తెలంగాణ ప్రజల కల సాకారం చేసినందుకు, ప్రాణాలను ఫణంగా పెట్టి దీక్ష చేపట్టిన తన భర్త ప్రాణాలను కాపాడేందుకు డిసెంబర్ 9 ప్రకటన చేసినందుకు కేసీఆర్ సతీమణి శోభ సోనియాగాంధీకి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియచేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన సమావేశం ధన్యవాదాలు, అభినందనలు, కుశల ప్రశ్నలతో సాగింది. కుటుంబసభ్యులు బయటకు వచ్చాక కేసీఆర్ మేడమ్‌తో పదినిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం అవసరమైన అంశాలపై ఆయన సోనియాకు ఒక నోట్ అందచేశారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే ప్రధాన డిమాండుతో పాటు నదీజలాల పంపిణీ, విద్యుత్ తదితర అంశాలు అందులో ఉన్నాయి. దాన్ని ప్రధానికి పంపిస్తానని సోనియా హామీ ఇచ్చారు.

kcrsonia1కతజ్ఞతలు చెప్పేందుకే…
సమావేశం అనంతరం కేసీఆర్ వివరాలను కేసీఆర్ మీడియాకు వివరించారు. సోనియా గాంధీ పట్టుదల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందుకు కతజ్ఞతగా కుటుంబ సభ్యుల సమేతంగా ఆమెను కలిసి ధన్యవాదాలు తెలిపాము.ఈ సందర్భంగా సోనియాగాంధీ మాకు దీవెనలు అందజేశారు. అని తెలిపారు. నేను అందజేసిన నివేదికను పరిశీలించి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చేరవేస్తానని సోనియా హామీ ఇచ్చారు. నేను మరో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి తెలంగాణ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నారు. వీరితో పాటు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు తమకు సహకారం అందించిన వివిధ పార్టీల నాయకులను కలుసుకుంటానని చెప్పారు. కాగా తాను సోనియాగాంధీతో రాజకీయ అంశాలు మాట్లాడలేదని చెప్పారు.మీరు ఢిల్లీలో ఉంటున్నారా అని వాకబు చేసి ..మిగతా విషయాలు దిగ్విజయ్‌సింగ్ మీతో మాట్లాడుతారుఅని చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.

ఓ తల్లి హదయంతో తెలంగాణ ప్రకటించారు: కేటీఆర్, కవిత
బిడ్డలను కోల్పోయిన తెలంగాణ తల్లుల కడుపుకోతను అర్ధం చేసుకుని ఓ తల్లిలా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని కేసీఆర్ కూతురు కవిత, కుమారుడు కేటీఆర్ టీ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 9 ప్రకటన చేసి తండ్రి ప్రాణాలను కాపాడిన సోనియాగాంధీకి తాము కుటుంబ సమేతంగా కలిసి ధన్యవాదాలు తెలిపామని వారన్నారు.ఈ సందర్భంగా సోనియాకు తెలంగాణ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి పట్టుచీరను ఆమ్మ, నేను కలిసి బహూకరించాముఅని కవిత టీ మీడియాకు తెలిపారు. సోనియాను కలిసిన కేసీఆర్ బందంలోఆయన సతీమణి శోభ,కుమారుడు కేటీఆర్ దంపతులు, కూతురు కవిత దంపతులు, మేనల్లుడు హరీష్‌రావు దంపతులతో పాటు మరో అల్లుడు సంతోష్, మనుమలు మనమరాళ్లు ఉన్నారు.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలి
– సోనియాకు కేసీఆర్ సమర్పించిన మెమోరాండం
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్రం పెద్దమనసు చేసుకుని సహకరించాలని సోనియాగాంధీకి సమర్పించిన నోట్‌లో కేసీఆర్ కోరారు. తెలంగాణ పటిష్ట పునర్నిర్మాణానికి కేంద్రం ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు ఆరు దశాబ్దాల లక్ష్యం నెరవేరాలంటే తక్షణమే ప్రత్యేక హోదా కల్పించి పారిశ్రామిక అభివద్ధికి సహకరించాలి. పన్నుల మినహాయింపు, ఇతర అంశాలలో రాయితీలను కల్పించాలి.

అధికారుల కొరతను తీర్చాలి
నూతన రాష్ట్రానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉంటుంది. అందువల్ల దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఐదేండ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద పంపాలి.

ప్రాణహితకు జాతీయ హోదా
తెలంగాణ కు తాగునీరు, సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెకును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి.

విద్యుత్ కొరత తీర్చండి
తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఏర్పడనున్నది. ఆ లోటును పూడ్చేందుకు కేంద్రం సహకరించాలి. కనీసం మూడు సంవత్సరాల పాటు 500 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్రం ఎన్‌టీపీసీ నుంచి అందజేయాలి. శంకరంపల్లి, నేదునూరు పవర్ ప్రాజెక్టులకు కేంద్రం గ్యాస్ సరఫరాచేయాలి.

విద్య, వైద్యరంగానికి ప్రాధాన్యత
తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆసుపత్రి ఆవశ్యత ఉన్నది. అందువల్ల ఇక్కడ ఢిల్లీలోని ఎయిమ్స్ బ్రాంచిని ఏర్పాటు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.