సొంతింటిని కళ్ల ముందే కూల్చివేయడాన్ని తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య

– గుజరాత్‌లో విషాదం
– అధికారుల తీరుపై కలత చెంది కుటుంబం ఆత్మాహుతి
– ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
ఎన్నో ఆశలతో కట్టుకున్న సొంతింటిని కళ్ల ముందే అధికారులు కూల్చివేయడాన్ని వారు తాళలేకపోయారు! గుండెలవిసేలా రోదించారు! తమకు జరిగిన అన్యాయం ఎవరి వద్ద మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమయ్యారు! ఏకంగా మున్సిపల్ కార్యాలయం ఎదుటే కుటుంబంలోని ఐదుగురు ఒంటికి నిప్పంటించుకున్నారు. అందులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వసుమతి(60), భరత్ మాన్సింగ్(40), ఆశా(35), రేఖ(30), గిరిశ్(27).. ఒకే కుటుంబంవారు. ఇటీవల అధికారులు అక్రమకట్టడాల పేరుతో వీరి ఇల్లును కూల్చివేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకునేవారు కనిపించకపోవడంతో బుధవారం రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట.. అధికారుల కళ్ల ముందే వీరంతా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.