సైతాన్ కు షాకిచ్చిన పోరుబిడ్డలు

తెలంగాణ ద్రోహి తమ జిల్లాల్లో అడుగు పెట్టడాన్ని నిరసిస్తూ ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అగ్గిరవ్వలయ్యాయి.  విజయలక్ష్మికి తెలంగాణ దెబ్బ రుచిచూపించాయి. విజయమ్మ పర్యటనను తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.  కొణిజర్లలో ఓయూ విద్యార్థి మధు ఆమె వాహనంపైకి దునికి చెప్పుతో దాడి చేసిండు.  పదులసంఖ్యలో ఉన్న పోలీసులను, వందమందికి పైగా ఉన్న వైసీపీ గూండాలను ఛేదించుకుని ఆమెవాహనంపై దాడి చేసి తెగువ ప్రదర్శించిండు.
తీవ్ర నిరసలు, మిన్నంటిన ఆందోళనల మధ్య జిల్లాలో పలుచోట్ల పర్యటించిన ఆమె చివరకు నల్లగొండ జిల్లాకు వెళ్లే ముందు పైనంపల్లిలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో విజయమ్మను అరెస్టు చేసిన పోలీసులు నల్గొండ పర్యటనను రద్దు చేసి హైదరాబాద్ పంపించారు. నల్గొండ సరిహద్దు గ్రామమైన పైనంపల్లిలో భారీ ఎత్తున తెలంగాణవాదులు అక్కడికి చేరుకొని ఆమె పర్యటనను అడ్డుకున్నారు. జిల్లాలో అడుగుపెట్టవద్దని పెద్దఎత్తున నినదించారు. వైఎస్‌ఆర్‌సీపీకి, విజయమ్మకు వ్యతిరేకంగా జై తెలంగాణ అంటూ నినదిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుకు అడ్డంగా వందలాదిగా బైఠాయించారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.