‘సెట్‌టాప్’కు.. రెండు వారాల గడువు- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు రెండు వారాల గడువు ఇస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలుచేసే ప్రక్రియలోభాగంగానే గడువు ఇచ్చామని.. అప్పటివరకు కేబుల్ ఆపరేటర్లు, ఇతరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలులేదని హైకోర్టు సోమవారం ఆధికారులకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

This entry was posted in MEDIA MUCHATLU.

Comments are closed.