సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నాకు గుచ్చుకున్నట్టే -సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లికి చెందిన వెయ్యి మంది టీఆర్ఎస్ లో  చేరారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సర్కారుకు ప్రాంతీయ భేదం లేదని.. అందుకే రామానాయుడు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా హైదరాబాదీలేనని  తేల్చిచెప్పారు. సెటిలర్ల కాలుకు ముళ్లు గుచ్చుకుంటే తనకు గుచ్చుకున్నట్టేనని అన్నారు.  హైదరాబాద్ కు ఘన చరిత్ర ఉందని.. మన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. .

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.