ఎవడున్నాడీ లోకంలో.. ప్రాంతీయ పక్షపాతి కానివాడు.
నువ్వెవరంటే..
నేను విశ్వమానవుడినని చెప్పగలిగే ధీరుడు.
కులమో, మతమో..
ఇజమో.. గిజమో…
ఒక చట్రంలో చిక్కని వాడెవ్వడు..
ఐనా మన పిచ్చి గానీ..
ముస్లింలకు అల్లా.. క్రైస్తవులకు జీసస్.. హిందువులకు రాముడో , కృష్ణుడో మరో ముక్కోటిదేవతలో..
దేవుళ్లే..
సర్వాంతర్యాములు.. కానీ సకల జనుల వాళ్లు కాదు కదా?
ప్రాంతీయంగా, మత , కులపరంగానో ఆరాధింపబడుతున్న వాళ్లే కదా..?
ఇంకెందుకు..
ఈ సెక్యూలర్ ముసుగులో తన్నులాట..
మేధావుల కలరింగ్లో విశాల హృదయత..
-అజయ్