సెక్యులరిజం బుర్ఖాలో కాంగ్రెస్

narendra
-దేశం సంక్షోభంలోకి వెళ్లిన ప్రతిసారీ
-అది లౌకికవాద ముసుగు ధరిస్తోంది
-ఢిల్లీ నేతల దోపిడీ వల్లే రూపాయి పతనం
-కాంగ్రెస్ పార్టీది విధ్వంసక పంథా
-వారసత్వ రాజకీయాలే దేశ సమస్యలకు మూలం
-‘గరీబీ హఠావో’ నినాదం ఏమైంది?
-కాంగ్రెస్‌కు లేశమావూతమైనా సిగ్గులేదు
-పుణె ర్యాలీలో ధ్వజమెత్తిన నరేంవూదమోడీ

బీజేపీ ప్రచార సారథి హోదాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ పూర్తిస్థాయి ఎన్నికల సమరానికి తెరతీశారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌పై తీవ్రస్థాయిలో విమర్శల జడివాన కురిపించారు. ఆర్థిక వ్యవస్థ మందగించడానికి, రూపాయి పతనానికి, అవినీతికి మన్మోహనే కారణమని నిందించారు. కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సెక్యులరిజం బుర్ఖాలో దాక్కుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదరికాన్ని నిర్మూలిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్.. ఆహార భద్రతా చట్టం పేరిట ప్రజలకు ఒక కాగితం ముక్కను ఇస్తోందని విమర్శించారు. ఆదివారం సాయంత్రం పుణెలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో నరేంవూదమోడీ ప్రసంగించారు. ఇటీవల గుజరాత్ అల్లర్లకు సంబంధించి ‘కుక్కపిల్ల’ (పప్పీ) వ్యాఖ్యలు చేసి.. ఇరుకునపడ్డ ఆయన కాంగ్రెస్‌పైఎదురుదాడిని ముమ్మరం చేశారు.

‘అవినీతి, ధరల పెరుగుదల, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం, మంత్రి జైలుకు వెళ్లడం, ఒక విద్యార్థినిపై అత్యాచారంతో దేశంలో అభవూదత.. ఇలా దేశం సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రతిసారీ లౌకికవాదం బుర్ఖా తొడుక్కొని.. కాంగ్రెస్ నేలమాళిగలో దాచుకుంటుంది’ అని మోడీ ఆరోపించారు. లౌకికవాదం ప్రమాదంలో ఉందన్న సాకుతో ధరల పెరుగుదల, అవినీతి, పేదరికం మాట్లాడరాదనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు అనుసరిస్తూ వస్తోందని, ఇకపై ఇది చెల్లదని ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కూర్చున్న నేతలు ప్రజాధనాన్ని దోచుకొని తినడంలో నిమగ్నలైపోయారు. అందువల్లే రూపాయి పతనం అవుతోంది. ఉత్తమమైన ఆర్థికవేత్తల మధ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధ్వంసక పంథాలో ముందుకుసాగుతోంది’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ ప్రముఖ పాత్ర ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే దేశంలోని సమస్యలకు మూలకారణమని దుయ్యబట్టారు.

ఈ వారసత్వ రాజకీయాలు ప్రజా ఆకాంక్షలను కాలరాశాయని తూర్పారబట్టారు. రాహుల్‌గాంధీని పరోక్షంగా సూచిస్తూ.. ‘కాంక్షిగెస్ యువరాజు పేదల ఇళ్లకు వెళుతారు. మీడియాను పిలిచి.. అక్కడ ఉన్న శిథిలావస్థకు తమ పూర్వీకులే కారణమని చెబుతారు’ అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. విధాన నిర్ణాయక పక్షవాతం వల్ల ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకురావడంలో ప్రభుత్వం నిష్క్రియగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ‘గరిభీ హఠావో’ అని కాంగ్రెస్ ఇచ్చిన నినాదం ఏమైందని మోడీ ప్రశ్నించారు. 35 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించడం విఫలమైందని, అందుకు కాంగ్రెస్ ఏమాత్రం సిగ్గుపడటం లేదని దుయ్యబట్టారు. తన మిత్రపక్షాలపై నమ్మకలేకపోవడంతోనే హడావిడిగా ఆహార భద్రతా బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని విమర్శించారు.

నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేయాలి: ‘ఫెర్గ్యూసన్’ విద్యార్థులతో మోడీ
ప్రస్తుతం దేశంలో 65శాతం మంది యువత ఉన్నారని, అయితే వారు తీవ్రంగా కష్టపడుతున్నా.. నైపుణ్యాల లేమితో ఇబ్బంది పడుతున్నారని నరేంవూదమోడీ పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని, దేశ నిర్మాణంలో ప్రతిభను ప్రోత్సహించాల్సిన ఉందని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన పుణెలోని ఫెర్గ్యూసన్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా బిల్లు, కామన్ క్రీడల కుంభకోణం నిందితుడు, స్థానిక ఎంపీ సురేశ్‌కల్మాడీపై తీవ్రంగా తప్పుబట్టారు. ‘రెండు దేశాలు రెండు క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి.

దక్షిణ కొరియా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించింది. భారత్ కామన్ క్రీడలను నిర్వహించింది. ఒలింపిక్స్ నిర్వహణతో కొరియాకు పేరు ప్రతిష్ఠలు రాగా, కామన్ నిర్వహణతో ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లమంది భారత ప్రజల పరువు తీశారు’ అని అన్నారు. ఈ వేదిక నుంచి రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్న మోడీ.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. మన వ్యవస్థ ప్రజల అంచనాలను అందుకుందా? అని ప్రశ్నించారు. ఆహార పథకాన్ని తీసుకువచ్చినంత మాత్రాన.. ఇది దేశంలోని అందరి కడుపు నింపదని విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రవచించిన 21వ శతాబ్దపు మిషన్ గురించి మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘21వ శతాబ్దం గురించి వినీవినీ మన చెవులు తుప్పుబట్టాయి.

భారత్‌ను 21వ శతాబ్దంలోకి ఎలా తీసుకు దార్శనికత ఎవరికైనా ఉందా? అలాంటి విజన్ ఉండి ఉంటే ప్రస్తుతం మనం ఇలాంటి పరిస్థితిలో ఉండేవాళ్లం కాదు’ అని పేర్కొన్నారు. సైబర్ నేరాల పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని గుజరాత్‌లో స్థాపించిన విషయాన్ని గుర్తుచేశారు. సృజనాత్మక ఆవిష్కరణల హబ్‌ను ఇన్ఫోసిస్ అధిపతి ఎన్‌ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో గుజరాత్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నిరాశాపూరితమైన వాతావరణం ఉందనే భావన ఉందని మోడీ పేర్కొన్నారు. ఈ భావన తప్పు అని, దీని నుంచి అందరూ బయటపడాలని సూచించారు. తాను ఇంకా నమ్మకాన్ని కోల్పోలేదని అన్నారు. పాశ్చాత్య ప్రభావానికి లోనుకాకుండానే భారత్‌ను ఆధునీకరించాల్సి ఉందని మోడీ పిలుపునిచ్చారు. విద్యా, ఇతర రంగాలలో గుజరాత్ సాధించిన ప్రగతిని వివరించారు. దేశ నిర్మాణంలో విద్యారంగానికి కీలక పాత్ర అని, మంచి విద్యా వ్యవస్థ ఉండాలంటే మంచి ఉపాధ్యాయులు కావాలని అన్నారు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.