సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్

-స్వయం ప్రతిపత్తిపై కేంద్రం ప్రతిపాదనలు సరిపోవు
-సీబీఐ డైరెక్టర్‌కు కార్యదర్శి హోదా..మూడేళ్ల పదవీకాలం ఉండాలి
-ఆర్థిక, పరిపాలన అధికారాలు ఇవ్వాలి

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ పదవీ కాలాన్ని కనీసం మూడేళ్లకు పెంచాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. డైరెక్టర్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండేళ్ల పదవీకాలం చాలా తక్కువని అభివూపాయపడింది. ఈ మేరకు సీబీఐ మంగళవారం సుప్రీంకోర్టులో 14 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి విషయమై కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రతిపాదనలపై తన అభివూపాయాలు తెలియచేసింది.

సీబీఐను వెలుపలి ఒతిళ్ల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి చాలా చేయాల్సి ఉందని, ఈ విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలు సరిపోవని సీబీఐ తన అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌కు ఉన్న పరిపాలన, ఆర్థిక అధికారాలు చాలా పరిమితమని, డైరెక్టర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. సీబీఐ డైరెక్టర్‌కు భారత ప్రభుత్వ కారదర్శి హోదా కట్టబెట్టాలని, ఆయనకు కార్యదర్శి ఎక్స్ ఆఫీషియో అధికారాలు ఇవ్వాలని కోరింది. సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ప్రమేయం లేకుండా డైరెక్టర్ నేరుగా మంత్రిత్వశాఖకు నివేదించే అధికారాలు కట్టబెట్టాలని అభ్యర్థించింది. తద్వారా తన విధులను ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా సీబీఐ నిర్వహించగలదని పేర్కొంది.

సీబీఐ అధికారుల అక్రమాలు, తప్పుడు ప్రవర్తన ఆరోపణలపై విచారణ చేసేందుకు జవాబుదారీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను సీబీఐ నిర్దంద్వంగా తిరస్కరించింది. సీబీఐ స్వయం ప్రతిపత్తికిగాను డైరెక్టర్ పదవీకాలాన్ని పొడిగించాల్సిన అవసరముందని గట్టిగా కోరింది. అలాగే ఆర్థిక, పరిపాలన విషయాలలో డైరెక్టర్ నేరుగా సంబంధిత మంత్రిత్వశాఖకు, మంత్రికి జవాబుదారీగా ఉండేలా వ్యవస్థ ఉండాలని, ఈ వ్యవస్థలో డైరెక్టర్ స్వతంవూతంగా వ్యవహరించడానికి వీలుంటుందని తెలిపింది. సీబీఐ సమర్థంగా తన విధులు నిర్వహించడానికి దానికి పరిపాలన, ఆర్థిక అధికారాలు కట్టబెట్టాల్సి ఉందని, ఈ విషయమై రోజువారీ వ్యవహారాల్లో మంత్రిత్వ శాఖ పరిధి నుంచి సీబీఐను తప్పించాల్సి ఉందని పేర్కొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.