సుడిగాడు.. 8 రోజుల్లో 79 సభలు

ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నరు. వరుస సభలతో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్నడు. టీకాంగ్రెస్, టీడీపీ, బీజేపీకి కంటికి మీద కునుకులేకుండా చేస్తున్నడు. సుడిగాలి పర్యటనలు చేస్తూ తెలంగాణను చుట్టేస్తున్నరు..  ఆదివారం ఒక్కరోజే ఆదిలాబాద్ జిల్లాలో 10 సభలు నిర్వహించిన్రు.  భైంసా, నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూరు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండంలో స్పీడ్ క్యాంపెయిన్ నిర్వహించిన్రు. 27వ తేదీవరకు మరో 69 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నరు.  8 రోజుల్లో 79 సభలు నిర్వహించి కేసీఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నరు.

-21న కరీంనగర్ జిల్లా: కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, చొప్పదండి, వేములవాడ, దుబ్బాక, తిమ్మాపూర్, హుజూరాబాద్, మంథని, పెద్దపల్లి

-22న వరంగల్, ఖమ్మం జిల్లాలు: భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, ఖమ్మం, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం.

23న నల్గొండ జిల్లా: కోదాడ, హాలియా (నాగర్జునసాగర్), దేవరకొండ, చండూరు (మునుగోడు), నకిరేకల్, తిర్మలగిరి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట.

-24న నిజామాబాద్, మెదక్: జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నర్సాపూర్

-25న మహబూబ్‌నగర్: కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, శాంతినగర్, గద్వాల్, మక్తల్, కొడంగల్, నారాయణపేట్, అడ్డాకుల

.-26న మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలు: నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, సిద్ధిపేట, సిరిసిల్ల, పరకాల, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, ఆలేరు, భువనగిరి.

-27న మెదక్, రంగారెడ్డి: తాండూరు, పరిగి, వికారాబాద్, మేడ్చల్, పటాన్‌చెరువు, ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, సంగరెడ్డిలో కేసీఆర్ సభలు నిర్వహించనున్నరు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.