సీమాంధ్ర సర్కారుకు పట్టని తెలంగాణ ‘పెద్ద బిడ్డ’ గోస తెలంగాణ జీవనాడిపై కరడుగట్టిన నిర్లక్ష్యం ప్రాణరహిత!

pranahita
– 2012 నాటికే పూర్తికావాల్సిన ప్రాజెక్టు.. ఇప్పటికీ బాలారిష్టాలను దాటలేదు..
-మొత్తం 28 ప్యాకేజీల్లో ఏడింటిలో అసలు పనులే ప్రారంభంకాలేదు
– అత్తెసరు నిధులతో అరకొర పనులు.. ఇలాగైతే మరో 50 ఏళ్లకూ పూర్తి కాదు!
– అనుమతుల మంజూరులోనూ నిర్లక్ష్యం.. 18 అనుమతుల్లో ఇప్పటికి వచ్చినవి ఆరే!
– ఇక జాతీయ హోదా దక్కేదెన్నడో?.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు, పార్టీలు

ఆది నుంచీ అదే మోసం! అడుగడుగునా అదే నిర్లక్ష్యం!! తెలంగాణను ముంచే ప్రాజెక్టులపై అత్యుత్సాహం చూపే సీమాంధ్ర సర్కారుకు.. ఈ ప్రాంత బీడు భూములను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులంటే మాత్రం కరడుగట్టిన నిర్లక్ష్యం. తెలంగాణ ప్రాజెక్టులపై సర్కారు వివక్ష కొనసాగుతున్నదనటానికి ప్రాణహిత-చే ప్రాజెక్టు వ్యవహారమే ఒక ఉదాహరణ. సీమాంధ్ర వివక్షకు బలైన తెలంగాణ ‘పెద్ద బిడ్డ’ ఇది! తెలంగాణ ప్రాంతానికి జీవనాడిలాంటి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులు సర్కారు నిర్లక్ష్యం మూలంగా నత్తనడక నడుస్తున్నాయి. ఈపాటికే నిర్మాణం పూర్తయి.. తెలంగాణ బీళ్ల నోళ్లు తడపాల్సిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. ఇప్పటికీ బాలారిష్టాలను దాటలేదు. తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకుగాను ఏడు జిల్లాల్లో సుమారు 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందజేసే ప్రాజెక్టు ఇది. దీని పనులను ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి, ఏజెన్సీలకు అప్పగించి ఇప్పటికి అయిదారేళ్లవుతున్నా… ఏడు ప్యాకేజీల్లో ఇప్పటికీ తట్టెడు మన్ను కూడా తీయలేదంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, అకుంఠిత దీక్షతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన సర్కారు… అత్తెసరు కేటాయింపులు చేస్త్తుండటంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిర్మాణంలో జాప్యం మూలంగా అంచనాలు అమాంతం పెరుగుతుండటంతో ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో అర్ధ శతాబ్దానికిపైగానే పట్టే అవకాశం కన్పిస్తోంది. పైపెచ్చు, జాతీయ హోదా పేరుతో సర్కారు కపట నాటకాలు ఆడుతోందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 2010 ఏప్రిల్‌లోనే కేంద్ర జలసంఘం సూత్రవూపాయ అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ పూర్తి స్థాయి అనుమతులను తెచ్చుకోవడంలో సర్కారు దారుణంగా విఫలమైంది. ఈ తరుణంలో జాతీయ హోదా ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

గోదావరి పరివాహక ప్రాంతాంలోని తెలంగాణలో ఏడు జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణలోని మెట్ట భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగాడ్డి, వరంగల్ జిల్లాల్లోని 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. మహారాష్ట్ర, మధ్యవూపదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వేన్‌గంగా, వార్ధా నదులు ఆదిలాబాద్ జిల్లా తుమ్డిహెట్టి గ్రామం వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి ప్రాణహిత మొదలవుతుంది. ఆ గ్రామం వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ప్రాజెక్టు ప్రారంభ స్థలం వద్ద 236.5 టీఎంసీల నీరు లభ్యమవుతుందని కేంద్ర జల వనరుల శాఖ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కింద మే 16, 2007న ప్రభుత్వం రూ.17,875 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తర్వాత డిసెంబర్ 17, 2008లో రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కింద రూ.38,500కోట్లకు అనుమతిచ్చింది. అయితే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.40,300 కోట్లుగా నిర్ధారించారు. ప్రాణహిత నదిలోని నీటి మళ్లింపు ద్వారా 160 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు వినియోగించుకోనున్నారు. 160 టీఎంసీల్లో 124 టీఎంసీలు వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు, 30 టీఎంసీలను జంటనగరవాసులకు తాగునీటికోసం, మరో 10 టీఎంసీలు ప్రాణహిత నుంచి చేవెళ్లకు వచ్చే మార్గంలోని గ్రామాలకు, 16 టీఎంసీలు పరిక్షిశమల వినియోగం కోసం కేటాయించారు. ప్రాణహిత బ్యారేజీ వద్ద ఫుల్ రిజర్వాయర్ లెవల్(ఎఫ్‌ఆర్‌ఎల్) + 152 మీటర్లుగా నిర్ధారించారు. ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు మొత్తం 1,055 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందులో 849 కిలోమీటర్లు గ్రావిటీద్వారా, 206 కిలోమీటర్లు సొరంగమార్గంద్వారా తీసుకురావలసి ఉంది. ఇందులో వివిధ ప్రాంతాల్లో మొత్తం 22 లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్టుల ఎత్తు 1,757 మీటర్లు ఉంటుంది. లిఫ్టుల కోసం 3,466 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని డీపీఆర్‌లో నిర్ధారించారు.

7 లింకులు.. 28 ప్యాకేజీలు
ఈ ప్రాజెక్టును 2018-19నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, 2015-16 నుంచే దశలవారీగా కొంత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2015 నుంచి నాలుగేళ్లలో అంటే 2018-19 నాటికి మొత్తం 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. మొత్తం 7లింకులు, 28 ప్యాకేజీల ద్వారా ప్రాణహిత నుంచి నీటిని తీసుకురానున్నారు. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మేడారం ట్యాంక్ ఆ తర్వాత మోతేవాగు (ఇక్కడ కొత్త జలాశయ నిర్మాణం చేపట్టాలి), అక్కడి నుంచి మిడ్‌మానేరు ద్వారా ఇమామాబాద్ (కొత్త జలాశయం), తడకపల్లి (కొత్త జలాశయం), తిప్పారం (పాత జలాశయం ఆధునీకరణ), పాములపర్తి (కొత్త జలాశయం) నుంచి శామీర్‌పేట చేరుకుంటుంది. ప్రధానలింకు ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్-రంగాడ్డి జిల్లాలకు ఉండగా, అదనంగా ఎస్సాస్పీ నుంచి రెండు లింకులు ఆదిలాబాద్, నిజామాబాద్‌లకు కలపనున్నారు. మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరుకు ప్రత్యేకంగా ఓ లిఫ్టు ద్వారా నీళ్లు తీసుకెళ్లడం ద్వారా సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.

Pranahitha12
ఏడు ప్యాకేజీల్లో ఇప్పటికీ ప్రారంభం కాని పనులు..
త్వరితగతిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టు పనులను 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి, 2007-08, 2008-09లోనే కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికి ఐదారేళ్లవుతున్నా… ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలను దాటలేదు. ఏడు ప్యాకేజీలలో (ప్యాకేజీ నం.3, 17, 18, 19, 24, 25, 26) ఇప్పటికీ అసలు పనులే ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చాలా ప్యాకేజీల్లో ప్రధాన కాలువలు, టన్నెల్ నిర్మాణం కోసం ఇన్వెస్టిగేషన్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. డిజైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. వీటి తర్వాతే కాలువలు, టన్నెల్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. నిధుల కొరత, పలు అనుమతుల్లో జాప్యం, భూసేకరణలో ఇబ్బందుల మూలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణ పనులు కొద్దికాలం నుంచి కొంచెం ఊపందుకున్నాయి. అతి కీలకమైన బ్యారేజీ నిర్మాణం(ప్యాకేజీ నం.3) ఇప్పటి దాకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా… ఇతరత్రా అనుమతులను తేవడంలో ప్రభు త్వం జాప్యం చేస్తుండటంతో ఈ ప్యాకేజీల్లో పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రాణహిత-చే మరో పోలవరం అయ్యే ప్రమాదం ఉందని నీటిపారుదల నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు సమస్య భూసేకరణే
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూ సేకరణ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 84,873 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు 79,612 ఎకరాలు ఉంటే అటవీ భూమి 5,261 ఎకరాలు ఉంది. కాగా, ఇప్పటికి సేకరించింది 4,266 ఎకరాలే! అటవీ శాఖ నుంచి తీసుకునే భూమికి బదులుగా మరోచోట భూమి ఇచ్చేందుకు అన్వేషణ జరుగుతోంది. ఈ జిల్లాల్లో ఎక్కడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు లేవని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. భూసేకరణ కోసం గతేడాదే స్పెషల్ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. భూసేకరణలో ఇబ్బందుల మూలంగా అతి కీలకమైన బ్యారేజీ, పంపు హౌజుల నిర్మాణంతోపాటు పలు ప్రాంతాల్లో టన్నెల్, కాలువల నిర్మాణం ప్రారంభం కాలేదు.

పైసల్లేవ్.. ఎప్పటికి పూర్తయ్యేనో మరి?
తెలంగాణకు జీవనాడిలాంటి ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం అంతులేని వివక్షను ప్రదర్శిస్తుండటంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 2012-13 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ గడువును 2018-19 నాటికి పొడిగించింది. 2014-15 నుంచే దశల వారీగా కొంత మేర ఆయకట్టుకు నీరిస్తామని చెబుతోంది. అయితే, ఇందుకు అనుగుణంగా నిధుల కేటాయింపు మాత్రం లేదు. 2007-08 నుంచి ఇప్పటి దాకా ఈ ప్రాజెక్టు కోసం చేసిన వ్యయం రూ.3 వేల కోట్లకు మించలేదు. తాజా బడ్జెట్‌లో కేటాయించింది రూ.782 కోట్లే. ఈ ప్రాజెక్టుకు 2007లో తొలుత పరిపాలనా అనుమతులు మంజూరు చేసినపుడు అంచనా వ్యయం రూ.17,875 కోట్లు కాగా, తర్వాత 2008లో దాన్ని రూ.38,500 కోట్లకు పెంచింది, అయితే సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.40,300 కోట్లుగా నిర్ధారించారు. ఎస్కలేషన్‌తో కలుపుకుని ఇది రూ.50 వేల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నెలకు రూ.100 కోట్లు కూడా దాట కనీసం నెలకు రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేసినా, ఏడాదికి రూ.1,200 కోట్లు అవుతుంది. ఇదే లెక్కన నిధులు ఖర్చు పెడుతూ పోతే.. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 50 ఏళ్లకుపైగానే పడుతుందని తెలంగాణ ప్రాంత నీటిపారుదల నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే ఏటా కనీసం రూ.7,500 కొట్ల చొప్పున ఖర్చు చేయాలని పేర్కొంటున్నారు.

అనుమతుల్లో అంతులేని జాప్యం
ప్రాణహిత-చే ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం 2010 ఏప్రిల్‌లోనే సూత్రవూపాయ అనుమతి ఇచ్చింది. 2012 నాటికి అన్ని అనుమతులు సాధిస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ప్రభు త్వం.. ఆచరణలో విఫలమైంది. అనుమతుల మంజూరు కోసం ప్రయత్నా లు నామమావూతంగానే సాగుతున్నాయి. కేంద్ర జలసంఘంలో 18 డైరెక్టరేట్‌ల నుంచి అనుమతులను సాధించాల్సి ఉండగా… ఇప్పటికి ఆరు అనుమతులు మాత్రమే వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన హైడ్రాలజీ (నీటి లభ్యత) క్లియన్సు ఈ ఏడాది జనవరిలో రావడం మాత్రం కొంత ఊరట కల్గించే విషయం. ఇప్పటికి అంతపూరాష్ట్ర వ్యవహారాల బోర్డు, సెంట్రల్ సాయిల్ రిసెర్చ్ స్టేషన్, కన్‌స్ట్రక్షన్ మషినరీ కన్సప్టూన్సీ (సీఎంసీ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు , కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి క్లియన్సులు వచ్చాయి. మరో 12 డైరెక్టరేట్‌ల నుంచి అనుమతులు లభించాల్సి ఉంది. వీటిలో కేంద్ర జలసంఘం నుంచి ప్రాజెక్టు అప్రెయిజల్, కాస్ట్ అప్రెయిజల్, ఇరిగేషన్ ప్లానింగ్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిస్సోస్‌లతో పాటు అతి కీలకమైన పర్యావరణ-అటవీ, గిరిజన మంత్రిత్వ శాఖల అనుమతులు ఉన్నాయి. ఈ అన్ని అనుమతులు వస్తేనే గానీ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి వీలుపడదని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ హోదా దక్కేదెన్నడు?
తెలంగాణకు వరవూపదాయనిలాంటి ప్రాణహిత-చే ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులు కేటాయించలేకపోయిన ప్రభుత్వం.. జాతీయ హోదా పేరుతో మరో నాటకం మొదలు పెట్టిందని పలువురు తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని మూడేళ్లుగా చెబుతున్నా.. ఈ దిశగా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు ఏమీలేవని ఆరోపిస్తున్నారు. ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే.. ప్రాజెక్టు వ్యయంలో కేంద్రమే 90 శాతం నిధులను భరిస్తుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే ముందుగా కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రణాళికా సంఘం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికి కేంద్ర జలసంఘం నుంచే పూర్తి స్థాయి అనుమతులు రాకపోవడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెన్నడని తెలంగాణవాదులు నిట్టూరుస్తున్నారు. మరోవైపు, ఒక రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు మాత్రమే జాతీయ హోదా ఇచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ, ప్రభుత్వం పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకొస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకొచ్చేందుకు చూపిస్తోన్న శ్రద్ధ.. ప్రాణహితపై చూపించడం లేదని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర జలసంఘం నుంచి అన్ని అనుమతులు రాగా… ప్రణాళిక సంఘం అనుమతులు కూడా త్వరలోనే వచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం.

Pranahithastachu
21 గ్రామాలకు ముంపు
ఈ ప్రాజెక్టువల్ల మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా శివ్‌ని, నాన్వాతుహమ్, అడేగోమ్, దరూర్, పనర, సల్జెహర్, తార్సాకుర్ధు, తాక్డా బుద్రూక్, రాయిడ్‌పేట్, గడ్చిరోలి జిల్లాలోని కుంగడమాల్, తాక్రి, రామన్‌జట్ట, ఇల్లూరు, ఆస్తి, అంకోర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలంలోని తుమ్డిహెట్టి, జన్‌గామ్, చంద్రపేట్, వీర్‌దొండి, తాడ్‌పల్లి, పార్ది గ్రామాలు ముంపు బారినపడనున్నాయి. ఈ గ్రామాలకు పునరావాస ప్యాకేజీని ప్రకటిస్తేనే బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడానికి వీలవుతుంది.

పట్టించుకోని ప్రజావూపతినిధులు, పార్టీలు
అయితే, తెలంగాణకు ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అటు ప్రజావూపతినిధులకు, అన్ని రాజకీయ పార్టీలకు ఏ మాత్రం పట్టడం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి రావడంతోపాటు వందల కొద్దీ గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో అసలు పనులే ప్రారంభం కాకున్నా.. ఏ ఒక్కరూ ఇదేమిటని ప్రశ్నించడం లేదు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కారుపై ఒత్తిడి తేవడం లేదు. అటు, పాలకులకు రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడమూ నానాటికీ జాప్యం అవుతోంది. రాష్ట్రం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నా… ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

ఏడు లింకులతో ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు…
లింక్-1 : ప్రాణహిత నది నుంచి శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ వరకు 56,500 ఎకరాలు
లింక్-2 : శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు రిజర్వాయర్ వరకు 00.00
లింక్-3 : మిడ్‌మానేరు రిజర్వాయర్ నుంచి ఉప్పర్ మేనేరు రిజర్వాయర్ వరకు 80,000 ఎకరాలు
లింక్-4 : మిడ్‌మానేరు నుంచి తిప్పారం ట్యాంక్ నుంచి పాములపర్తి వరకు 4,08,000 ఎకరాలు
లింక్-5 : తిప్పారం నుంచి చిట్యాల వరకు 2,20,500 ఎకరాలు
లింక్-6 : తిప్పారం ట్యాంక్ నుంచి చేవెళ్ల ట్యాంక్ వరకు 4,35,000 ఎకరాలు
లింక్-7 : ఎస్సాస్పీ పరివాహక ప్రాంతం నుంచి నిజాంసాగర్ కాలువలు,
నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు 4,40,000 ఎకరాలు
మొత్తం 16,40,000ఎకరాలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చే సుజల స్రవంతి పథకం స్వరూపం ఇదీ
ప్రాజెక్టు సామర్థ్యం : 180 టీఎంసీలు
ప్రాణహిత నుంచి : 160 టీఎంసీలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి : 20 టీఎంసీలు
బ్యారేజీ నిర్మాణం : తుమ్మిడి హట్టి గ్రామం,
కౌటాల మండలం, ఆదిలాబాద్ జిల్లా.
ఆయకట్టు : 16,40,000 ఎకరాలకు సాగునీరు
నీటి కేటాయింపులు : 16.40 లక్షల ఎకరాలకు
సాగునీటికి 124 టీఎంసీలు
జంటనగరాలకు తాగునీరు : 30 టీఎంసీలు
ఇతర ప్రాంతాలకు తాగునీరు : 10 టీఎంసీలు
పరిక్షిశమలకు : 16 టీఎంసీలు
ప్రాజెక్టు పరిధిలోని జిల్లాలు : 7 (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్,
నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగాడ్డి)
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం : రూ.38,500 (పరిపాలన అనుమతి)
సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ప్రకారం : రూ.40,300 కోట్లు
ఇప్పటి వరకు చేసిన వ్యయం : సుమారు రూ.2,800 కోట్లు
శంకుస్థాపన : 16-12-2008, నాటి సీఎం
వైఎస్‌రాజశేఖర్‌డ్డి చేశారు.
ప్యాకేజీలు : 28
కాలువ పొడవు : 1,055 కిలోమీటర్లు
గ్రావిటీ కాలువ పొడవు : 849 కి.మీ
సొరంగ మార్గం పొడవు : 206 కి.మీ
మొత్తం లిఫ్టులు : 22
లిఫ్టు ఎత్తు : 1757 మీటర్లు
అవసరమైన విద్యుత్ : 3466 మెగావాట్లు
(8701 మిలియన్ యూనిట్లు)
భూసేకరణ : 84,873 ఎకరాలు
ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన లక్ష్యం : 2018-2019

గత ఐదేళ్లలో బడ్జెట్‌లో కేటాయించిన
నిధులు, ఖర్చులు (కోట్లలో)
సంవత్సరం బడ్జెట్ ఖర్చు
2008-09 260 231.04
2009-10 600 735.36
2010-11 700 102.72
2011-12 608.29 595.05
2012-13 1,050 1,190.62
2013-14 782

మొత్తం జిల్లాలు : 7
మొత్తం మండలాలు : 97
గ్రామాల సంఖ్య : 1,744
నియోజకవర్గాలు : 34
ఆయకట్టు : 16,40,000

ఏ జిల్లాలో ఎంత ఆయకట్టు?
జిల్లా పేరు సాగులోకి వచ్చే లబ్ధికలిగే గ్రామాలు
ఆయకట్టు ఎకరాల్లో మండలాలు
ఆదిలాబాద్ 1,56,500 19 306
కరీంనగర్ 1,71,449 10 159
నిజామాబాద్ 3,04,500 19 275
మెదక్ 5,19,152 22 539
నల్లగొండ 2,29,832 11 171
రంగాడ్డి 2,46,704 14 283
వరంగల్ 11,863 2 306

This entry was posted in ARTICLES, TELANGANA NEWS.

Comments are closed.