సీమాంధ్ర బంద్‌లో మీడియా కనికట్టు

-యథావిధిగా నడుస్తున్న ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు
-ఒక్క బస్సు కదలడం లేదంటూ అభూతకల్పన

‘రగులుతున్న సీమాంధ్ర’, ‘బస్సులు బంద్.. స్తంభించిన రాకపోకలు’, ‘బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ అధికారులు’ ఇవి వారం రోజులుగా కొన్ని పత్రికలు, సీమాంధ్ర టీవీ చానళ్లలో కనిపిస్తున్న శీర్షికలు.. వినిపిస్తున్న ప్రత్యేక కథనాలు. అయితే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇవేమీ పట్టని సీమాంధ్ర మీడియా మాత్రం గోరంతలను కొండతలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయాలపై నిజనిజాలు తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ఓ చిన్న ప్రయత్నం చేసింది.

నగరం నుంచి.. ప్రధానంగా ఇమ్లిబన్ బస్ స్టేషన్, కూకట్‌పల్లి నుంచి సీమాంధ్ర ప్రాంతానికి నిత్యం సుమారు 1600 ఆర్టీసీ బస్సుల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కూడా వీటి సంఖ్య కాస్త అటు ఇటుగానే ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇదేస్థాయిలో బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిసింది. బస్సుల సంఖ్య తగ్గడంపై ఆర్టీసీ అధికారులను అడిగితే.. ప్రయాణికుల సంఖ్య తగ్గడమే కారణం తప్ప.. సీమాంధ్ర బంద్ కారణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రైవేటు బస్సు ఏజెంట్లు మాత్రం చానళ్లలో వస్తున్న వార్తల కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జూన్ 30కి ముందు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇదే తరహా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని ఆర్టీసీ అధికారులే అంటున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి సాధారణంగా కన్న కొంచె తక్కువ సంఖ్యలో బస్సులను నడిపిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఈ నెల 5, 6వ తేదీల్లో 1100బస్సుల వరకు నడిపించినట్లుగా ఆర్టీసీ ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. ఉద్యమ ప్రభావం వల్ల ఇప్పటివరకు సీమాంవూధకు బస్సులు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలిపారు. నల్గొండ మీదుగా విజయవాడకు వెళ్లే బస్సు సర్వీస్‌ల్లో ఎలాంటి మార్పులు లేనట్లుగా తెలుస్తున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రూట్‌లో బస్సులు యథావిధిగా వచ్చిపోతున్నాయని ఆర్టీసీ రంగాడ్డి జిల్లా చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంవూదవూపసాద్ ‘టీ మీడియా’కు వివరించారు. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా.. సీమాంధ్ర నేతలు, సీమాంధ్ర మీడియా మాత్రం పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.