ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఏపీ సభలో వారి అహంకారం స్పష్టమైంది. ఒక్క క్షణం కూడా కలిసుండే ప్రసక్తే లేదు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు అవలంభిస్తున్న వైఖరి చూస్తుంటే తెలంగాణ నుంచి వారిని పంపించాల్సిందే’అని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీవూపసాద్ అభి ప్రాయపడ్డారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మాట్లాడారు. విభజన వద్దనే ఏ శక్తులతో చర్చలకు సిద్ధంగా లేమన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణచడానికే సర్కారు సీమాంవూధుల ఉద్యోగులతో సమ్మె చేయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు కలిసి తెలంగాణను అడ్డుకుంటున్నాయన్నా రు. తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు చేస్తున్నది ఉద్యమం కాదని.. టీవీ చానళ్ల పోరాటమని ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యంచేస్తే తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సమరానికి దిగాల్సి వస్తుందన్నారు. అధిష్ఠానంపై టీ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.