సీమాంధ్ర పార్టీలను బొందపెట్టాల్సిందే

 

KTR– ‘ఆంధ్రా పార్టీలకు సమాధి.. తెలంగాణకు పునాది’
– ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలి
– టీఆర్‌ఎస్ శిక్షణాతరగతుల్లో కేటీఆర్ పిలుపు
బానిస బతుకులనుంచి విముక్తి కలగాలంటే ఆంధ్రా పార్టీలను బొందపెట్టాల్సిందేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబుల పార్టీలను నమ్మొద్దన్నారు. రంగాడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మలిపెద్ది సుధీర్‌డ్డి అధ్యక్షతన గురువారం కీసర మండలంలోని వర్ధనా పాఠశాల ఆవరణలో జరిగిన టీఆర్‌ఎస్ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ఆంధ్రా పార్టీలకు సమాధి.. తెలంగాణకు పునాది’ అనే నినాదంతో ముందుకెళ్లాలని, వచ్చే ఎన్నికలను తెలంగాణ ఉద్యమంలో భాగంగా భావించి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. టీఆర్‌ఎస్ గెలిస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని, ఇప్పుడు తెలంగాణ రాకుంటే ఇంకెప్పుడు రాదనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌ను ఓడించాలని, చంద్రబాబు మోసాల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న జగన్ పార్టీ అవినీతి పార్టీగా భావించాలన్నారు. టీఆర్‌ఎస్ రానున్న రోజుల్లో కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకంకాదని లగడపాటి, రాయపాటిలాంటి పెట్టుబడిదారులే వ్యతిరేకులన్నారు. తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనని సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. ఆయనకు మద్దతు తెలిపే తెలంగాణ నేతలను ఏమనాలో తెలియడంలేదన్నారు. తెలంగాణ నేతలతోనే ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తూ మనకంట్లో మనవేలితోనే పొడిపించే కుట్రలు సీమాంక్షిధులు చేస్తున్నారని చెప్పారు.

అవినీతి కూపాల్లో కూరుకుపోయిన మంత్రులతో త్వరలోనే సీఎం చంచల్‌గూడ జైలులో కేబినెట్ భేటీ నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో బొంద పెడితేనే ప్రత్యేక రాష్ట్రం త్వరగా సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ గెలిస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకారలకు సాగు నీరందించే ప్రాజెక్టులు నిర్మించడం జరుగుతుందని చెప్పారు. అంతకు ముందు రాజకీయ విశ్లేశకులు వీ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ఖనిజాన్ని సీమాంవూధులు దోచుకుంటున్న వివరాలను వివరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.