సీమాంధ్ర పత్రికలపై తెలంగాణవాదుల ఆగ్రహం

తెలంగాణ గడ్డమీద ఉంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించని పత్రికలను బహిష్కరిస్తామని టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారంనాడు తెలంగాణ భవన్ ఎదుట సీమాంధ్ర పత్రికల ప్రతులను గ్రేటర్ టీఆర్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు దహనం చేశారు. టైమ్స్ నౌ సర్వే నివేదికను వక్రీకరించి, కేంద్రాన్ని తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశాయని ఆరోపిస్తూ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికల ప్రతులను దగ్ధం చేశారు.

పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సొంత ఎజెండాలతో పనిచేస్తున్న సీమాంధ్ర పత్రికలను తరిమికొడతామని హెచ్చరించారు. కార్యక్షికమంలో నియోజకవర్గ ఇంచార్జులు మన్నె గోవర్ధన్‌డ్డి, సతీష్‌డ్డి, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి చామకూర సుధాకర్‌డ్డి, జీవన్‌సింగ్, శ్రీనివాస్, షేక్ అన్వర్, చలపతి, శంకర్‌లాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ సీమాంధ్ర ప్రతికల దహనం జరిగింది. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపైన విషం కక్కుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని టీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. సీమాంధ్ర ఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణపై తప్పుడు కథనాలు ఇస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడేలా కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ-టైమ్స్‌నౌ-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో టీఆర్‌ఎస్ 13 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్న విషయాన్ని సీమాంధ్ర మీడియా కావాలనే ప్రచారం చేయలేదని ధ్వజమెత్తారు. వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద, మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాతోపాటు మెదక్, రంగాడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో సీమాంధ్ర పత్రికల ప్రతులను దహనం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.