సీమాంధ్ర నేతలవి తప్పుడు లెక్కలు: కేటీఆర్

హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎంకు తప్పుడు నివేదిక ఇచ్చి పైశాచిక ఆనందం పొందిన్రని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఆదాయంపై సీమాంధ్ర నేతలుతప్పుడు లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో రూ 50 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ లెక్కలు చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాద్ మహానగరమని గుర్తు చేశారు. టీ కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటే అంతకంటే నీచమైన పని మరొకటి లేదని చెప్పారు. సీమాంధ్ర నేతలను ఆస్తులను పెంచుకోవడం తప్ప హైదరాబాద్‌కు చేసిందేమి లేదని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతలు అబద్ధాల పునాదుల మీద నివేదికలు ఇస్తున్నారని, అది వారి విచక్షణకే వదిలేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు చెప్పాల్సింది విద్యార్థులకు, ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగసంఘాలకని చెప్పారు. సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడే వారికి సంఘీభావం కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, సీఎం పదవి కోసం నేనంటే నేనని పోటీపడుతున్నారని తెలిపారు. ఆత్మస్తుతి… పరనింద… వ్యవహారంలా వరంగల్ టీ కాంగ్రెస్ నేతల కృతజ్ఞత సభ నడిచిందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.