సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య తోపులాట

హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇవాళ సచివాలయంలో జరిగిన సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సమావేశంలో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఒక్కసారిగా రసాభాస మొదలైంది. అడహక్ కమిటీ వేయాలని సీమాంధ్ర ఉద్యోగులు కోరగా, కోరంలేదని సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. ఈ విషయంలో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రభస జరిగింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.