సీమాంధ్ర గుండాలను అరెస్టు చేయాలి: టీ అడ్వొకేట్స్

తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర ఫాక్షనిస్టులు, రౌడీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఇవాళ తెలంగాణ న్యాయవాద జేఏసీ నేతలు డీజీపీ దినేష్‌రెడ్డి, లా అండ ఆర్డర్ అడిషనల్ డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. సీమాంధ్రలో జరుగుతున్న కృతిమ ఉద్యమంలో జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని వారు ఆరోపించారు. అమాయక ప్రజలను రెచ్చగొడుతూ విధ్వంసం సృష్టిస్తోన్న ఫ్యాక్షనిస్టులు, రౌడీలను అరెస్టు చేసి జైలుకు పంపాలని వారు కోరారు. సీమాంధ్ర మీడియా కూడా లేని పోని రెచ్చగొట్టే దృశ్యాలను పదేపదే ప్రసారం చేస్తూ అక్కడి ప్రాంతంవారిని రెచ్చగొడుతున్నారని అన్నారు. సీమాంధ్ర మీడియా జర్నలిజం విలువలను మంటకలుపుతుందని, ఎన్‌బీఏ నిబంధలను ఉల్లంఘిస్తున్నారని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాద జేఏసీ నేతలు కోరారు. తెలంగాణ నాయకులను, తెలంగాణ కావాలనుకునే వారిని తగులబెట్టాలని రెచ్చగొట్టే విధంగా సీమాంధ్ర నేతలు ఉపన్యాసాలిస్తున్నారని వారు డీజీపీకి తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.