సీమాంధ్ర కుట్ర మీడియా!

-విభజన వ్యతిరేక ఆందోళన లపై చానళ్ల అత్యుత్సాహం

– మండే గుండెలంటూ రెచ్చగొట్టే యత్నం.. ముందు రోజు తెలంగాణ నినాదాలు.. మరుసటి రోజే అసలు స్వరూపం వెల్లడి
-సీమాంధ్ర పత్రికలదీ అదే తీరు.. ఇక్కడ జై తెలంగాణ అంటూ సంబరం.. అక్కడ రాష్ట్రం ముక్కలైందని ఆవేదన

 ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమైపోతుందనేది నాజీల సూత్రం! ఒక చిన్న ఆందోళనను పదే పదే చూపితే.. పెద్దదైపోతుందనేది సీమాంధ్ర మీడియా సిద్ధాంతం! సీడబ్ల్యూసీలో తెలంగాణకు సానుకూల నిర్ణయం వచ్చిన మరుసటి రోజు సరిగ్గా ఇదే రుజువైందంటున్నారు తెలంగాణవాదులు! కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంవూధలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి. కొన్నిచోట్ల స్వల్ప ఉద్రిక్తతలూ చోటుచేసుకున్నాయి. ఇక్కడే సీమాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని, తాను సీమాంవూధకు కొమ్ముకాసే శక్తినని నిరూపించుకుందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. వార్తా పత్రికలూ తామేమీ తక్కువకాదని నిరూపించుకున్నాయి. తెలంగాణ ఎడిషన్‌లలో ఉత్సాహం ప్రకటించి.. సీమాంధ్ర ఎడిషన్లలో మాత్రం విషాదరాగాలు తీశాయి.

ఇక్కడ జై తెలంగాణ అంటూ హెడ్డింగులు పెట్టిన పత్రికలు.. అక్కడ రాష్ట్రం రెండు ముక్కలైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాతకోతలు సాగించాయి. నిజానికి ఆందోళనలు, హింసాత్మక ఘటనలు, ఆత్మహత్యలు తదితర వార్తలను పదే పదే ప్రసారం చేయరాదని జాతీయ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమం కనీవినీ ఎరుగని రీతిలో మహోధృతంగా సాగిన సమయంలో నిబంధనల అమలు పేరుతో ఉద్యమవార్తలను కవర్ చేయడానికే ఇష్టపడని సీమాంధ్ర మీడియా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో మాత్రం ఆ నిబంధనలను వదిలిపడేసింది. జనాన్ని పోలీసులు తరుముతుంటే.. వాటిని పదే పదే చూపటం ద్వారా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సదరు ఆందోళనలకు తక్కువ మందే జనం వచ్చినా.. ఒకటి రెండు జిల్లాల్లోనే చెదురుమదురు ఘటనలు జరిగినా.. యావత్ సీమాంవూధలోనూ ఇదే వాతావరణ ఉందన్న అభివూపాయం కల్పించేందుకు విశ్వవూపయత్నం చేశాయి. గంట గంటకూ వచ్చే న్యూస్ బులెటిన్‌లలో పావుగంటపాటు అవే క్లిప్పింగులు పదే పదే చూపి.. వాటిని పెద్దగా చూపేందుకు వెనుకాడలేదు. నిజానికి ఇవే చానళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుందని వార్తలు వచ్చిన తర్వాత తమ వైఖరిని కొంత సడలించుకుని.. తెలంగాణ పాటలతో తమచానళ్లను హోరెత్తించాయి. తెలుగు జాతి ఇక రెండు రాష్ట్రాల్లో ఉంటుందని ఘనంగా ప్రకటించాయి. కానీ.. 12 గంటల వ్యవధిలోనే సీన్ మారిపోయింది. తెలంగాణ ప్రాంతంలో చిన్న ఉద్యమం జరిగినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. లాఠీచార్జిలు, అరెస్టులతో నానా హంగామా సృష్టించేవారు. దీనికి విరుద్ధంగా సీమాంవూధలో పోలీసులు చాలా చోట్ల ప్రేక్షక పాత్ర పోషించారు. నిజానికి అవి పట్టించుకునేంత పెద్దవి కాకపోవడంతోనే పోలీసులు అలా వ్యవహరించారన్న వాదనలు ఉన్నాయి. కానీ.. సీమాంధ్ర మీడియా మాత్రం వాటికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.

ఆంధ్రవూపదేశ్ చిత్రపటంలో తెలంగాణ జిల్లాలను వేరు చేస్తూ ‘మండే గుండెలు’ అంటూ ఒకరు.. ముక్కలైందని మరొకరు ఇలా తమకు తోచిన విధంగా ఆందోళన కార్యక్షికమాలకు అధికవూపాధాన్యం ఇచ్చి తెలంగాణ వ్యతిరేకతను చాటుకున్నాయని తెలంగాణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ బంద్ పిలుపులను నాడు వ్యతిరేకించిన సీమాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు బుధవారం ఆంధ్రా, రాయలసీమ బంద్ పిలుపు దృశ్యాలను విపరీతంగా ప్రచారం కల్పించాయి. దానికి తోడు అక్కడ ఏదో జరిగిపోతున్నదన్నట్లు సమాంతరంగా చర్చావేదికలను నిర్వహించాయి. కడప, చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన కూడళ్ళలో జరిగిన ఆందోళన కార్యక్షికమాలను మరీ మరీ చూపించారు. అనంతపురంలో రాజీవ్‌గాంధీ విగ్రహం కూల్చివేత, ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలపైన అదే విధంగా వ్యవహరిస్తూ చూసే వాళ్లకు అన్ని ప్రాంతాల్లోనూ ఇలానే జరుగుతున్నదన్న అభివూపాయం కల్పించేందుకు ప్రయత్నించారు. ఇది లేని విద్వేషాలు రెచ్చగొట్టి.. వాటికి ఆజ్యం పోయడం తప్ప మరొకటి కాదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇలాంటి చానళ్లకు తెలంగాణ రాష్ట్రంలో కనీస రేటింగ్‌లు కూడా దక్కవని తేల్చి చెబుతున్నారు.

 

This entry was posted in CRIME NEWS.

Comments are closed.