సీమాంధ్ర ఉద్యమానికి సోనియా ప్రోత్సాహం

గీత దాటిన నేతలపై క్రమశిక్షణ చర్యలు లేవా?
సీమాంవూధలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రోత్సాహం అందిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి పీ మురళీధర్‌రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడారు. అధిష్ఠానం ఎదుట కనీసం నిల్చోవడానికి సాహసించని కాంగ్రెస్ నాయకులు సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి, సీమాంవూధలో ఉద్యమాన్ని అధిష్ఠానమే ఎగదోసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోనియానే నిజమైన హైకమాండ్ అయితే తెలంగాణపై నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యమే రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికార పీఠంలో కూర్చోపెడుతుందని జోస్యం చెప్పారు. క్షీణిస్తున్న రూపాయి విలువ, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, దేశ భద్రతలో డొల్లతనాన్ని పార్లమెంట్ బిల్లుల విషయంలో వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.