– రాజగోపాల్ ‘కెవ్వుకేక’ అన్నది అందుకే
ఆకలి కేకల నినాదం మాది: హరీశ్‌రావు
తెలంగాణ రాకపోతే హైదరాబాద్‌లో ‘క్లీనింగ్’ బంద్
జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
‘‘ఆకలి కేకల నుంచి వచ్చిన ఉద్యమం మాది. సీమాంవూధులు చేస్తున్న ఉద్యమం ‘ఐటమ్‌సాంగ్’ లాంటిది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కెవ్వుకేక అనేలా చేస్తామని లగడపాటి రాజగోపాల్ ప్రకటించడంతోనే వారి ఉద్యమం పరిస్థితి అర్థం అవుతున్నది’’ అని టీఆర్ఎస్ఎల్పీ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్నారని, ఆస్తులు కాపాడుకోవడానికే లగడపాటిలాంటి లోఫర్లు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేయిమంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే మంత్రులు మాత్రం పదవులు కాపాడుకుంటూ ఉద్యమాన్ని అణిచివేసేవిధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మంగళవారం ఖైరతాబాద్‌లోని సెంట్రల్ జోన్ కార్యాలయంలో గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యూనియన్ (జీహెచ్ఎంసీఈయూ) కార్యాలయాన్ని హరీశ్‌రావు ప్రారంభించి అనంతరం యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ కార్మికులు ఒక్కరోజు తమ పనిని పక్కనపెడి తే ఆ కంపులో సీమాంవూధులు కొట్టుకుపోతారన్న సంగతి మరువరాదని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ము న్సిపల్ కార్మికుల పాత్ర ఉందని, వారిని చిన్నచూపు చూడరాదని పేర్కొన్నారు.
సీమాంధ్ర ప్రజావూపతినిధులు ఢిల్లీలో లాబియింగ్ చేస్తూ తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిన సంగతి సీమాంధ్ర ప్రజావూపతినిధులు మరిచారా?అని ప్రశ్నించారు. సీమాంవూధుల కుట్రలను తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రజావూపతినిధులు విఫమవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం వస్తే 28 నుంచి హైద్రాబాద్‌లో చెత్త ఎత్తడాన్ని నిలిపివేయిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీమాంధ్ర నేతలు విభజనను అంగీకరించాలన్నారు.
కానీ, లగడపాటి జోకర్ వేషాలు వేస్తున్నారని విమర్శించారు. హైద్రాబాద్ విషయంలో రాజీపడేదిలేదన్నారు. తెలంగాణ కోసం 28 తర్వాత తీవ్రమైన ఉద్యమానికి సిద్ధమవుతుట్లు పేర్కొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ యూనియన్ అధ్యక్షుడు యూ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ నినాదంతో జీహెచ్ఎంసీలో జెండా ఎగురవేశామన్నారు. పిలుపునిస్తే కార్మికుల తడాఖా చూపిస్తామని చెప్పారు. ఇందులో జీహెచ్ఎంసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమరేశ్వర్, ప్రధాన కార్యదర్శి జబ్బార్, సలహాదారు కులకర్ణి, సెంట్రల్ జోన్ కార్యదర్శి శంకర్సింగ్నాయక్, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు యాదయ్య, యూనియన్ నాయకులు హరిరాం, సత్యనారాయణ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 28లోపు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పోరుబాట పట్టనుంది. గురువారం తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు తెలిపారు.