సీమాంధ్రుల లెక్కలన్నీ తప్పే

రాష్ట్ర ఆదాయంలో సగభాగం హైదరాబాద్ నుంచే వస్తుందన్న సీమాంవూధుల లెక్కలన్నీ తప్పేనని, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు జీవోఎంకు అందజేసిన లెక్కలు బహిర్గతం చేశాయి. దీంతో ఇంతకాలం రాష్ట్ర ఆదాయంలో 50శాతం హైదరాబాద్ నుంచే వస్తుందని చెబుతున్న లెక్కలు తప్పని తేలాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాలతో సీమాంధ్ర నేతలు ఇరుకున పడ్డారు. నగర ఆదాయంపై సీమాంధ్ర ప్రజలకు చెబుతున్నవన్నీ కట్టుకథలే తప్ప వాస్తవం కాదని అధికారుల నివేదికతో తేలిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆదాయ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు గురువారం జీవోఎంకు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం ఆదాయం రూ. 1,27,566.74కోట్లు. తెలంగాణ జిల్లాల నుంచి రూ. 41,391.92కోట్ల ఆదాయం ఉండగా , కోస్తాంధ్ర నుంచి రూ.47,937.22కోట్లు, రాయలసీమ నుంచి రూ.18,215.39కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు వివరించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్ర ఖజానాకు రూ. 20,022.21కోట్ల ఆదాయం లభిస్తున్నట్లు అధికారులు జీవోఎంకు వివరించారు. మొత్తం రాష్ట్ర ఆదాయంలో సీమాంధ్ర జిల్లాల నుంచి రూ.66,152.61కోట్లు ఆదాయం ఉండగా , హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ జిల్లాల నుంచి రూ. 61,414.13 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.